పాలమూరు, డిసెంబర్ 9 : వైద్యులు దైవానికి ప్రతిరూపమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉ మ్మడి రాష్ట్రంలో నాలుగు మెడికల్ కళాశాలలు మాత్ర మే ఉండేవని, 70 ఏండ్లలో మన రాష్ర్టానికి ఒకే మెడిక ల్ కళాశాల వచ్చిందన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కే సీఆర్ సహకారంతో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేశారన్నారు. మొట్టమొదటి కళాశాలను మ హబూబ్నగర్లోనే ఏర్పాటు చేసుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. కళాశాల మంజూరు కాకముందే స్థలాన్ని గుర్తించామని, ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి రెండేండ్లలోనే పనులు పూర్తి చేశామన్నారు. కళాశాల ప్రారంభమైన మూడో సంవత్సరంలోనే పీజీ సీట్లు కూ డా తెచ్చుకున్నామని తెలిపారు. ఉస్మానియా, గాంధీ త ర్వాత రాష్ట్రంలో ఇక్కడి కాలేజీకి పేరుందన్నారు.
రా ష్ట్రంలో ఏటా 2,500 నుంచి 3 వేల మంది మెడికల్ వి ద్యార్థులు బయటకు వస్తున్నారని, 1400 మంది పీజీ డాక్టర్లను తయారు చేస్తున్నామన్నారు. దేశానికి సరిప డా సూపర్ స్పెషాలిటీ వైద్యులు మన రాష్ట్రం నుంచే వె ళ్తున్నారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు ఇది వరకే న ర్సింగ్ కళాశాల మంజూరు కాగా, కొత్తగా డెంటల్ కళాశాల కూడా రానున్నదన్నారు. ఇతరులకు సేవను అం దించడంలో మదర్‌థెరిస్సా, డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సమాజానికి తమ వంతు సేవ చేయాలన్న తలంపుతో విద్యనభ్యసించాల ని కోరారు. కేవలం రూ.10 ఫీజు తీసుకొని అద్భుతమై న సేవలందించే డాక్లర్లు ఉన్నారని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్‌స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నట్లు వెల్లడించా రు. కొత్త కలెక్టరేట్లో క్వార్టర్స్ కూడా నిర్మిస్తామన్నారు. వైద్యుల జీతాలు పెంచే విధంగా సీఎం కేసీఆర్‌కు సిఫారసు చేసిన మంత్రుల్లో తాను ఒకడినని తెలిపారు. కా ర్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టర్ రమేశ్, ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ డా. రాంకిషన్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, డా.శామ్యూల్, డా. రామ్మోహన్, వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. కిరణ్, నవకల్యాణి, సునంద, వైద్య కళాశాల విద్యార్థుల కో ఆర్డినేటర్ రిషికేష్, రమ్య తదితరులు పాల్గొన్నారు.