గద్వాల, జనవరి 10 : అంధత్వాన్ని నివారించడానికే తెలంగాణ ప్రభుత్వం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు కార్యాచరణ కార్యక్రమాన్ని జ్వోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రా రంభించారు. అనంతరం సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష స మావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ము ఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కంటివెలుగు వంటి అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గద్వాలలో కంటివెలుగు కార్యక్రమ నిర్వాహణకు 25 టీంలను ఏర్పా టు చేశామని తెలిపారు. శిబిరాల వద్ద ప్రభుత్వం కంటి పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుందని చె ప్పారు. శిబిరాల కోసం జిల్లాలోని అన్ని రైతు వేదికలు వినియోగించుకోవాలని అధికారులకు ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలను క్యాంపుల వద్దకు తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఇది సామాజిక కార్యక్రమమని, ప్రజల హృదయాల్లో స్థా నం సంపాదించుకోవడానికి మంచి అవకాశమని ఉం దన్నారు. కళ్లను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనపై ఉందన్నారు. పోషకాహార, జన్యుపరమైన లోపాలతో కంటి సమస్యలు వస్తున్నాయని, వాటిని గుర్తించి ప్రజలకు కంటి పరీక్షలు చేసి అద్దాలను ప్రభుత్వం అందించనున్నదని తెలిపారు. గద్వాల జిల్లాలో 18 ఏండ్లపై బడిన వారు 3,75,354 మంది ఉన్నారని, వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు.
2018 ఆగస్టులో మొదటి విడుత కంటి వెలుగు నిర్వహించగా.. రెండో విడుతను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్ర భుత్వ ఉద్యోగులు, ప్రజలతో మమేకమై కంటి వెలుగు ను సక్సెస్ చేయాలన్నారు. ఎమ్మెల్యేలతోపాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలు రాత్రివేళల్లో గ్రామాల్లో బస చేయాలని సూచించారు. ప్రపంచాన్ని నడిపించేది జర్నలిజమని ఒక చిత్రం ద్వారా ప్రభుత్వాన్ని కదిలించే శక్తి వా రికి ఉందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో వారు భాగస్వాములు కావాలన్నారు. ఎమ్మెల్యేలు కోరితే జి ల్లాలో మూడు రోజులు కంటి వెలుగు కార్యక్రమాలు జరిగే గ్రామాల్లో బస చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పీహెచ్‌సీలకు ఆ దరణ పెరుగుతున్నదని, రాష్ట్ర గౌరవాన్ని దేశ స్థాయిలో ఇనుమడింప చేసిందన్నారు. తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే ఆర్థికంగా ఎంతో బలపడుతున్నదని చె ప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా 6 నుంచి 7 లక్షల జనాభా ఉన్న జిల్లాలకు ఓ మెడికల్ కళాశాలతోపాటు 600 పడకల దవాఖానను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కంటివెలుగు కరపత్రంతోపాటు అద్దాలను మంత్రి, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. స మావేశంలో ఎంపీ రాములు, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఢిల్లీ అధికార ప్రతినిధి మందా జగన్నాధం, జెడ్పీచైర్‌పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, మున్సిపల్ చైర్మన్ కేశవ్, అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, ఇన్చార్జి డీఎంహెచ్‌వో నళిని, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామన్‌గౌడ్, ప్రజాప్రతినిధులు ఉన్నారు.