నారాయణపేట, జూలై 24: రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీపురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జిల్లాకేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో మంత్రి జన్మదినం సందర్భంగా కేక్‌కట్‌చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ప్రభుత్వదవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మంత్రి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు సేవచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనుసూయ, ఏఎంసీ చైర్మన్ జ్యోతి, కౌన్సిలర్లు రాజేశ్వర్, శివకుమార్‌రెడ్డి, శిరీష, తిరుపతమ్మ ఉన్నారు.
ఊట్కూర్, జూలై 24: రాష్ర్టాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఆదర్శంగా తీసుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం కేటీఆర్ జన్మదిన వేడుకలను మండలకేంద్రంలో ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేసి ప్రజలకు తీపిని పంచారు. అభివృద్ధికి నిలువెత్తు నిదర్శంగా కేటీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ అరవింద్‌కుమార్, నాయకులు లక్ష్మారెడ్డి, శివరామరాజు, నర్సింహారాజ్గౌడ్, శంకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, నాసీర్ఖాన్, షమి, వెంకటేశ్‌గౌడ్, ఒబేదుర్ రహిమాన్, తరుణ్, ఆనంద్‌రెడ్డి, గంగాధర్‌చారి, శివారెడ్డి పాల్గొన్నారు.
మక్తల్‌టౌన్, జూలై 24: నియోజవకర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ నాయకులు కేక్‌కట్ చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నాయకులు అమరేందర్‌రెడ్డి, మొగులప్ప, అన్వర్‌హుస్సేన్, చిన్నహన్మంతు, తాయప్ప, శాలం, విష్ణువర్ధన్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, ఈశ్వర్, నేతాజీ, చెన్నయ్యగౌడ్, శేఖర్, నర్సింహ, ఆనంద్, మైమూద్, సాగర్, మనోహర్, సాధిక్ తదితరులు ఉన్నారు.
ధన్వాడ, జూలై 24: మండల కేంద్రంలోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం మండలకేంద్రంలోని ప్రభుత్వం వైద్యశాలలో రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. గున్ముక్లలో సర్పంచ్ కేక్‌కట్ చేశారు. ఎంనోనిపల్లీలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రైతులకు పండ్లను పంపిణీ చేశారు. ధన్వాడలో జరిగిన కార్యక్రమంలో పేట మార్కెట్ కమిటీ సభ్యడు కొండారెడ్డి, నాయకులు చంద్రశేఖర్, శివారెడ్డి, పటేల్ నర్సింహులు, మసూద్, నాజర్, శ్రీనివాస్‌గౌడ్, శివాజీ, నర్సింహులు, గోపాల్‌గౌడ్, నర్సింహులు, బాలరాజు, షాకీర్ హుస్సేన్, తాజు, వీరేశ్, వసీం, శాంతకుమార్, భరత్, సమీ పాల్గొన్నారు.
మరికల్, జూలై 24: మండలకేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. పట్టణ ప్రధా న కార్యదర్శి నర్సింహులు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నారాయణ పేట జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖారెడ్డి, సర్పంచ్ కస్పే గోవర్ధన్, వైస్ ఎంపీపీ రవికుమార్, ఎంపీటీసీలు, సుజాత, గోపాల్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద, జూలై 24: మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ కూడళిలో కేక్‌కట్ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ భీమయ్యగౌడ్, సోషల్‌మీడియా మండల నాయకులు అంజిపుట్టి, మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు గ్యాంగ్ హన్మంతు, నాయకులు కన్కిరెడ్డి, తిప్పణ్ణ, నర్సింహ, మాజీ ఉపసర్పంచ్ శెట్టి శ్రీనివాస్, అశోక్, ప్రహాల్లాద్గౌడ్, ఎంబీ హన్మంతు, ఏర్పుల బాబు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ, జూలై 24: ్ణమండలకేంద్రంలోని క్షీరలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్పాటీల్, ప్రధాన కార్యదర్శి మోనేశ్, జెడ్పీటీసీ అంజనమ్మపాటీల్, ఎంపీపీ వెంకట్రెడ్డిపాటీల్, శివప్ప, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, శివరాజ్పాటీల్, సర్పంచ్ రాధామహదేవ్ పాల్గొన్నారు.
నర్వ, జూలై 24: మండల కేంద్రంలోని రామాలయంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రి కేటీఆర్ ఆయారారోగ్యలతో ఉంటూ రాజకీయ జీవితంలో మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు. అనంతరం అంబేద్కర్ కూడళిలో కేక్ కట్‌చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములుశెట్టి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మండ్ల చిన్నయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేటరూరల్, జూలై 24: మండలంలోని అప్పిరెడ్డిపల్లి శివారులోని శ్రీరామకొండపై వెలిసిన ఆలయంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ లు చేసి కేక్ కట్ చేశారు. అలాగే మొక్కలు నాటారు. కార్యక్రమంలోయూత్ అధ్యక్షుడు మోహన్‌నాయక్, నాయకులు రాజు, విశ్వనాథ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.