మదనాపురం, ఆగస్టు 11 : ప్రజాసేవతోనే జన్మకు సార్థకత చేకూరుతుందని, ప్రతిఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మదనాపురంలోని వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమా ణ స్వీకార కార్యక్రమానికి మంత్రి రాజనర్సింహతోపా టు సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి హాజరయ్యారు.
ముందుగా మార్కెట్ కమిటీ చైర్మన్ ప్ర శాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, డైరెక్టర్లతో జిల్లా మా ర్కెటింగ్‌శాఖ అధికారి స్వరణ్‌సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మండలంలోని కొన్నూరు లో రూ.2.18కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్, రూ.20లక్షలతో నిర్మించిన హెల్త్ సబ్‌సెంటర్, రూ.20లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల భవనాలను మంత్రి రాజనర్సింహ ప్రారంభించారు.
కొ న్నూరు ఉన్నత, ప్రాథమిక పాఠశాలను రూ.1.5కోట్ల వ్యయంతో నిర్మించగా, మన ఊరు-మనబడి కార్యక్ర మం కింద ఉన్నత పాఠశాలలకు రూ.54.34 లక్షలు, ప్రాథమిక పాఠశాలకు రూ.8.77 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. మిగిలిన మొత్తాన్ని మాజీ ఎంపీటీసీ శరత్‌రెడ్డి విరాళంగా ఇవ్వడం అభినందనీయమని మంత్రి అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంత డబ్బు సం పాదించినా ప్రయోజనం లేదని, ప్రజాసేవకు అం కితం అయినప్పుడే జన్మకు సార్థకత లభిస్తుందని చె ప్పారు. శరత్‌రెడ్డిని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులతో మాట్లాడా రు. పాఠశాల నిర్మాణానికి నిధులు విరాళంగా అందించిన శరత్‌రెడ్డి, కొండారెడ్డిలను ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అభినందించారు. దేవరకద్రలో 100 పడకల దవాఖాన, కొత్తకోటలో 50పడకల దవాఖాన ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని మంత్రిని ఎ మ్మెల్యే కోరగా, సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, డీఈవో గోవిందరాజులు, పంచాయతీ కార్యనిర్వాహక ఇంజినీర్ మల్ల య్య, మాజీ ఎంపీటీసీ శరత్‌రెడ్డి పాల్గొన్నారు.
మూసాపేట, ఆగస్టు 11 : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి రాజనర్సింహ వైద్యులకు సూచించారు. మండలంలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కొరత ఉన్నదని డాక్టర్ షభానాబేగం మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
కొత్తకోట, ఆగస్టు 11 : కొత్తకోట పట్టణంలోని అం బాభవానీ ఆలయంలో మంత్రి రాజనర్సింహ ప్రత్యేక పూజ చేసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కా ర్యక్రమంలో ప్రశాంత్, కృష్ణారెడ్డి, శ్రీను, శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.