గోపాల్పేట, మే 10: రైస్ మిల్లర్లు జిల్లా వ్యాప్తంగా తరుగు, తాలుపేరుతో క్వింటాకు మూడు కిలోలపైన దోపీడీ చేయడాన్ని అధికారులు అరికట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్రెడ్డి డి మాండ్ చేశారు. మండల కేంద్రంలో సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం తెలంగాణ రైతు సం ఘం వనపర్తి జిల్లా కమిటీ పరిశీలించింది.
ఈ సందర్భంగా పదిరోజులుగా లారీల కొరతతో ధాన్యం కొనుగోలు నిలిపి వేయడానికి నిరసనగా రైతులతో కలిసి బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. పదిరోజుల నుంచి లారీల కొరతతో కొనుగోలు నిలిపివేయడం సరైన పద్ధతి కాదన్నారు. రో జుకు ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి కనీసం 3 లారీలనైనా ఏర్పాటు చేస్తే సమస్య పపిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు.
మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రోజురోజుకు 5 లారీల వరకు వచ్చేవిధంగా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన పంటను అమ్ముకునే దశ లో కూడా ఇన్ని ఇబ్బందులకు గురవడం సరైన వి ధానం కాదని, కొనుగోలు కేంద్రాల్లో కూడా రైతులకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వమే ధాన్యాన్ని ఆరబెట్టడానికి కవర్ల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వచ్చేవరకు రాస్తారోకో విరవించేదిలేదని రోడ్డుపై భీస్మించుకు కూర్చున్నారు.
దీంతో రాస్తారోకో వద్దకు జిల్లా సివిల్సైప్లె అధికారి విశ్వనాథం వచ్చి రైతు సంఘం నాయకులతో మాట్లాడి రోజుకు 4లారీల నుంచి 5లారీల వరకు పంపిస్తామని, త రుగు, తాలు పేరుతో జరుగుతున్న దోపిడీని పరిశీలన చేసి రైతులకు న్యాయం చేసేవిధంగా ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించా రు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల్రాజు, మాజీ స ర్పంచ్ శ్రీనివాసులు, మాజీ కోఆప్షన్ సభ్యుడు మ తీన్, నాయకుడు కాశీనాథ్, రైతులు వెంకటయ్య, కృష్ణయ్య, బాలరాజు, కృష్ణమ్మ, లక్ష్మి, వెంకటలక్ష్మి, శాంతమ్మ, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.