మద్దూర్, అక్టోబర్ 19 : మద్దూర్ పట్టణంలో అభివృద్ది పనుల పేరిట ప్రధాన రహదారులను రెండు లైన్లుగా మార్చే క్రమంలో రేణివట్ల చౌరస్తా నుంచి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు రెండువైపులా 70 ఫీట్ల రహదారిని విస్తరించే పనుల్లో భాగంగా శనివారం అర్ధరాత్రి అ ధికారులు ఎలాంటి సమాచారం లేకుండా జేసీబీలతో షాపుల కూల్చివేతలు ప్రారంభించారు. రేణివట్ల చౌరస్తా నుంచి ప్రభుత్వ దవాఖాన ప్రహరి వైపు 35ఫీట్లు దాటి అవతలి వైపు మిగిలిన దుకాణాలను రాత్రికి రాత్రే కూల్చి వేయడంతో బాధితు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 35 ఫీట్లు తొలగించినా మిగితా భాగాన్ని ఎవరికి చెప్పకుండా తొలగించడం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
అధికారులు ముందే చెబితే కనీసం దుకాణాల్లోని సామగ్రి, మిషనరి, ఇతర వస్తువులను తీసుకెళ్లేవారనమి చెబుతున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆదివారం రోడ్డుపై బైఠాయించి బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుల ఆందోళనతో 2గంటలపాటు ట్రాఫిక్ జామైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్‌ను ఫోన్లో సంప్రదించగా, అందుబాటులోకి రాలేదు.
ఇటీవలే గ్రామాల్లో జాయింట్ ఇన్స్పెక్షన్ నడుస్తుంది. అలాగే ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేస్తున్నాం. అనంతరం పత్రికల్లో నోటిఫికేషన్, అవార్డు చేయడం జరుగుతుంది. ప్రధానంగా వల్లభాపురంలో 87ఎకరాలు, బొల్లారం లో 73ఎకరాలు, సంగినేనిపల్లిలో 82ఎకరాలు గుర్తించాం. నెల రోజుల్లోపు వీటిని కొలిక్కి తె చ్చి పనులు నడిపిస్తాం. మిగితా గ్రామాల్లో క్రమంగా దృష్టి పెడతాం. భూసేకర వేగవంతం చేస్తాం.
– డీ సుబ్రహ్మణ్యం, ఆర్డీవో, వనపర్తి