ఎంజీకేఎల్ఐ రైతుల పాలిట కల్ప తరువులా మారింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు సాగునీటికి సమస్య లేకుండా చేసింది. ఎత్తిపోతల పరిధిలో ఎల్లూరు(కొల్లాపూర్), 2.14టీఎంసీలతో జొన్నలబొగుడ (కోడేరు), 0.96 టీఎంసీలతో గుడిపల్లి(నాగర్‌కర్నూల్) రిజర్వాయర్లతో పాటుగా కొల్లాపూర్ సమీపంలో 0.55 టీఎంసీల సామర్థ్యంతో సింగోటం శ్రీవారి సముద్రం రిజర్వాయర్‌గా మారింది. 4 లక్షలకుపైగా ఎకరాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. బీడు భూముల్లో జలసిరులు సంతరించుకున్నాయి. ముళ్ల చెట్లు, కరువు ఛాయలతో కనిపించిన నాటి పల్లెలు ఇప్పుడు పచ్చని పంటలతో ధాన్యపు భాండాగారాలుగా మారిపోయాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న పాలనాపరమైన నిర్ణయంతో జిల్లా ముఖ స్వరూపమే మారిపోయింది. ఇక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే సాగునీరు పుష్కలమై నాగర్‌కర్నూల్ మరో కోనసీమగా మారనున్నది.
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ) : కందనూలు.. గతంలో కరువు కాటకాలకు కేరాఫ్ అడ్రస్.. గ్రా మాల్లో ఒక్క పూట తిండికి నోచుకోని పేదలు వేలల్లో.. ఊర్లల్లోకి వస్తుంటె సర్కారు తుమ్మ చెట్లు, చుక్కనీరు లేక మైదానం లా తలపించే చెరువులు.. ఎండాకాలం వస్తే తాగునీటి కోసం రాత్రింబవళ్లు కుళాయిలు, ట్యాంకర్ల వద్ద పడిగాపులు.. బిందెలతో రోడ్లు, ఆఫీసుల వద్ద ధర్నాలు.. ఇక సేద్యం బహుదూ రం.. పదెకరాలున్న రైతులూ పట్నంలో వలస కూలీలే.. భూ ములన్నీ బీళ్లుగా పందులకు ఆవాసాసలు.. దీంతో హైదరాబాద్, ముంబై, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పొట్టకూటి కోసం వృద్ధులైన కన్న తల్లిదండ్రులు, పాలు తాగే పిల్లలను ఇండ్ల వద్దే వదిలి కన్నీళ్లతో దేశంలో భవన నిర్మాణరంగంలో పని చేసేదీ ఇక్కడి పేదలే. ఇవన్నీ ఇప్పుడు గతం. తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఈ కష్టాలన్నింటికీ శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చింది. దీనిలో ప్రధాన భూమిక మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారితంగా కొల్లాపూర్ మం డలం ఎల్లూరులోని రేగుమాన్గడ్డ వద్ద ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. శ్రీశైలం రిజర్వాయర్ అప్రోచ్ చానల్, టన్నెల్ ద్వారా కృష్ణా నదిలోని నీటిని ఎత్తిపోతల ద్వారా ఎల్లూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నింపి, గ్రావిటీ కెనాల్ ద్వారా సింగోటం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నింపుతారు.
అక్కడి నుంచి గ్రావిటీ కాల్వ, టన్నెల్ ద్వారా రెండో దశలో ఎత్తిపోసి పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ రిజర్వాయర్‌ను నింపుతారు. ఇక్కడి నుంచి గోపాల్పేట మండలం గౌరీదేవిపల్లి, నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి మధ్యనున్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన రిజర్వాయర్ ద్వారా మూడో దశ ఎత్తిపోతలను నింపుతున్నారు. అక్కడి నుంచి అచ్చంపేట నియోజకవర్గంలోని అచ్చంపేట, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల, వంగూ రు, నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, తెలకపల్లి, కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి, వెల్దండ, మాడ్గుల(రంగారెడ్డి జిల్లా), జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్(మహబూబ్‌నగర్ జిల్లా), వనపర్తి జిల్లా పరిధిలోని వనపర్తి, గోపాల్పేట, పెద్దమందడి, ఖిల్లాఘణపూర్ ప్రాంతాల్లో 3.40లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు డిజైన్ చేయబడింది. తొలుత 1984 సంవత్సరంలో ప్రాజెక్టు రూపకల్పనకు చర్చ జరిగింది. నాటి టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి విడిచిపెట్టింది. 2002లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.1,766కోట్ల అంచనాతో 2014నాటికి రూ.37,00కోట్లకు చేరుకొంది.
కాగా తెలంగాణ ఉద్యమ సెగతో 2012లో నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎల్లూరు రిజర్వాయర్‌ను ప్రారంభించారు. కానీ కల్వకుర్తికి ఉద్దేశించిన ఈ పథకం లక్ష్యం మధ్యలోనే నిలిచిపోయింది. ఆ తర్వాత స్వరాష్ట్రం రావడంతో పాటుగా పెండింగ్ బిల్లులు చెల్లించి, అడ్వాన్సు మొబిలైజేషన్ కింద నిధులు చెల్లించి సీఎం కేసీఆర్ ఆదేశాలతో నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జొన్నలబొగుడ వద్ద రాత్రి వేళల్లో నిద్రించి పనులు శరవేగంగా చేసేలా కృషి చేశారు. పెండింగ్‌లో ఉన్న రిజర్వాయర్లు, పంపుహౌస్‌లు, విద్యుత్ పనులు, భూసేకరణ పూర్తి చేశారు. ఇలా 2015-16 సంవత్సరంలో ప్రాజెక్టులోని జొన్నలబొగుడ(2.14టీఎంసీలు), గుడిపల్లి రిజర్వాయర్(0.96టీఎంసీలు) అందుబాటులోకి వచ్చాయి. అలాగే కొల్లాపూర్ మండలంలోని సింగోటం శ్రీవారి సము్ర దం(0.55టీఎంసీలు) బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మారింది. ప్రాజెక్టు ఆయకట్టును 4.20లక్షల ఎకరాలకు పెంచారు. జిల్లాగా మారిన ఈ నాలుగేండ్లలో చెరువులను, కుంటలను నింపుతూ బీడు భూములను పచ్చని మాగాణుల్లా మార్చా యి. జిల్లాలో 500వరకు పెద్ద చెరువులను నింపుతున్నారు.
దీనివల్ల అదనంగా 50వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఇదిలా ఉంటే ఈప్రాజెక్టు ఆధారంగా కొత్తగా బిజినేపల్లి మండలం లట్టుపల్లి వద్ద మార్కండేయ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. దీనికి దాదాపుగా రూ.76కోట్ల వరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేయగా ఇది పూర్తైతే 8వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు ఆధారంగా దుందుభీ వాగుపై సిర్సవాడ, పాపగల్, మేడిపూర్, ఉల్పరలాంటి పలు చోట్ల చెక్ డ్యాంల నిర్మాణంతో సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. ఇలా జిల్లాలో ఎంజీకేఎల్ఐ ద్వారా 4లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం విశేషం.మిషన్ కాకతీయ ద్వారా 1,567 చెరువులను పునరుద్ధరించారు. మత్స్యసంపద పెరిగింది. సాగు, తాగునీటి సమస్య తీరింది. గ్రామాలు, పట్టణాల్లో బోర్ పాయింట్ చూపించాల్సిన అవసరం లేకుండానే బోర్లు వేస్తున్నారు. ఇంతకు ముందు వెయ్యి ఫీట్లు డ్రిల్లింగ్ చేసినా నీళ్లు పడని ప్రాంతాల్లో 100 ఫీట్లకే కృష్ణమ్మ ఉబికి వస్తోంది. ఎప్పుడో సంతల్లో మాత్రమే కనిపించే చేపలు ఇప్పుడు రో జూ ఇంటి ఆ హారంగా మారాయి. ప శు గ్రాస సమ స్య తీరింది. ట్రాక్టర్లు, ఎద్ద్దుల బండ్లల్లో గతంలో రైతులు పశువులను కాపాడుకునేందుకు పశుగ్రాసం, నీళ్ల కోసం పడిన కష్టాలు కనుమరుగయ్యాయి. ఏ డాదంతా వానకాలంతో సంబంధం లేకుండా వేసవి కాలంలోనూ చెరువు లు మత్తడి దుంకుతున్నాయి.
ఇక 24 గంటలూ నీళ్లు, విద్యుత్ ఉచితంగా వస్తుండటంతో సేద్యం సంబురంగా సాగుతోంది. వరి, వేరుశనగ పంటల సాగు గణనీయంగా పెరిగింది. పట్నాలు వలస వెళ్లిన పేదలు ఊళ్లోనే పనులు దొరుకుతుండటంతో స్వగ్రామాలకు చేరుకొని కుటుంబాలతో హాయిగా జీవిస్తున్నారు. సాధారణానికి మించి పంటల సాగు జరుగుతోంది. దీనివల్ల భూ ముల ధరలు పదింతలయ్యాయి. ఇంతకు ముందు ఎకరం రూ.లక్ష పలకని భూములు రూ.25లక్షలుగా మారాయి. ఇలా బీడు భూ ములు కోట్లను కురిపిస్తున్నాయి. సామాన్యులను కుబేరుల్లా చేస్తున్నాయి. గ్రామాల్లో గుడిసెలు మాయమయ్యాయి. పట్టణాల్లో మేడలను తలపించేలా ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వ్యవసాయ క్షేత్రాల వద్ద ఫాంహౌస్‌లు వెలుస్తున్నాయి. దీనంతటికీ మూలం ఒక్క మహాత్మాగాంధీ కల్వకుర్తి ప్రాజెక్టే కావడం అక్షరాలా నిజం. 1984లో అంకురార్ప ణ జరిగాక నీళ్లు వస్తాయా, కనీసం కృష్ణానది చెంతనే ఉన్న కొల్లాపూర్‌కు చుక్క నీరైనా వస్తుందా అన్న సందేహాలున్న సమయంలో రాష్ట్రం ఏర్పాటు కావడంతో ప్రాజెక్టు స్వరూపం మారిపోయింది. ప్రా జెక్టు కోసం గతం లో ఎన్నో చేసినా నాటి పాలకులు పూర్తి స్థా యిలో దృష్టి సారించలేదు. సీ ఎం కేసీఆర్ వల్ల కందనూలు కు ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా కృష్ణానది తరలి వచ్చింది. రైతుల క న్నీళ్లను తుడిచి జి ల్లా వరప్రదాయినిగా మారింది.
సీఎం కేసీఆర్ నాయకత్వం వల్లే ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు పూర్తయ్యింది. నాటి పాలకులు పెండింగ్‌లో ఉంచితే సీఎం ప్రారంభించారు. దీనివల్ల గతంలో కంప చెట్లతో ఎకరా రూ.50వేలు పలకనిభూముల ధరలు ఇప్పుడు ఎకరా పాతిక లక్షలకు చేరుకుంది. ఇతర ప్రాంతాల ప్రజలు వచ్చి భూములు కొంటున్నా దొరకడం లేదు. దండగ అన్న వ్యవసాయం పండుగలా మారింది. రైతులంతా తమ పొలాల్లో పని చేసుకుంటూ ఉన్న ఊళ్లోనే కుటుంబాలతో సంతోషంగా జీవిస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతల కూడా పూర్తి చేయడం అదృష్టం. రాబోయే కాలంలో కందనూలు జిల్లా మరో కోనసీమలా మారుతుంది.