వనపర్తి, జూలై 12 (నమస్తే తెలంగాణ) : విద్యుత్‌శాఖలో జరుగుతున్న పనుల వివరాలను మీడియాకు లీకు చేయొద్దని, ఇప్పటికే విద్యుత్‌శాఖ చాలా బదనాం అ యిందని కాంట్రాక్టర్ల సమావేశంలో పలువురు విద్యుత్ అధికారులు మొరపెట్టుకున్నారు. విద్యుత్‌శాఖలో టెండర్లు లేకుండా ఇష్టానుసారంగా జరుగుతున్న పనుల తీరు, రెండేండ్ల్లుగా పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ కనెక్షన్ల వ్యవహారంపైన ‘నమస్తే తెలంగాణ’లో ‘రైతుల నిరీక్షణ’, ‘గోల్మాల్ గోవిందా’.. అనే శీర్షికన ఇటీవల వరుస కథనాలు వెలువడ్డాయి. వీటిపై శు క్రవారం విద్యుత్ డీఈ కార్యాలయంలో వి ద్యుత్శాఖలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖలో జరుగుతున్న ప్రతి విషయాన్ని మీడియాకు ఎందుకు చెబుతున్నారని, ఎవరు చెబుతున్నారో కూడా తమకు తెలుసని, ఇది మం చి పద్ధతి కాదని అధికారులు సూచించారు. కనీసం ఇప్పటి నుంచైనా ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వొద్దని, క్రమంగా శాఖపరమైన పనుల్లో పారదర్శకతను పెంచేందుకు కాంట్రాక్టర్లు తోడ్పాటునందించాలని కోరారు.
అయితే కిందస్థాయిలో ఏఈ, ఏడీల నుంచే పనులకు సంబంధించిన ప్రతిపాదనలు డీఈ కార్యాలయానికి రావాలని, ఒక పద్ధతిని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సమావేశంలో నిర్ణయించారు. కాంట్రాక్టర్లు ఎలాం టి తొందరపాటు లేకుండా శాఖ సమాచారాన్ని బయటకు చేరవేయడాన్ని పూర్తి గా నిలిపివేయాలని, శాఖాపరంగా గా డితప్పిన వ్యవస్థను సరి చేసుకోవాలంటే కాంట్రాక్టర్లు కూడా తమకు సహకరించాలని కోరారు. సమావేశంలో ఇన్చార్జి ఎస్ఈ కే భాస్కర్, ఇన్‌చార్జ్జి డీఈ డాక్టర్ రాచప్ప, ఏడీ స్టోర్ ఇన్చార్జి చక్రవర్తి, పలువురు సబ్ ఇంజినీర్లు, విద్యుత్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే వనపర్తి విద్యుత్‌శాఖ పరంగా ఒక ఎస్ఈ, డీఈ, మరో ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కుడం రాష్ట్రంలోనే చర్చనీయాంశమైంది. గతంలో ఎప్పుడూ విద్యుత్‌శాఖలో ఇ లాంటి పరిస్థితి లేదు. ప్రతిపనికి లంచం అన్న రీతిలో వి ద్యుత్శాఖలో చాలా పనులు జరిగాయి. వీటిలో లక్షల రూ పాయలు చేతులు మారినట్లుగా చర్చ ఉంది. ఇప్పటికైనా విద్యుత్‌శాఖ పనితీరు సక్రమమైన విధానంలో జరగాలని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.