అచ్చంపేట కేటీఆర్ సభను ఊహించని విధంగా భారీగా తరలివచ్చి సక్సెస్ చేసిన అచ్చంపేట ప్రజానీకానికి నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట ఇన్చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి ధన్యవా దాలు తెలిపారు. అచ్చంపేటలో గతంలో ఎన్నడూ జరగని విధంగా కొద్దిసమయంలోనే కేటీఆర్ సభను విజయవంతం చేసిన నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నా యకులు, కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞ
తలు తెలిపారు.
ఈ సభజోష్తో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ సభ క్యాడర్లో ధైర్యం, భరోసా నిం పిందన్నారు. ప్రజల్లో పార్టీకి మరింత ఆదరణ పెరిగిందన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తా రని అనుకోలేదని.. మళ్లా గులాబీజెండా ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.