తిమ్మాజిపేట/బిజినేపల్లి, ఫిబ్రవరి 7 : కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. తిమ్మాజిపేటకు చెందిన కదిరి పాండు, అమ్మపల్లికి చెందిన బాలరాజు కొన్నాళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వారికి పార్టీ తరఫున బీమాకు సంబంధించి రూ.2లక్షల చొప్పుల ఇద్దరికి పరిహారం చెక్కు లు మంజూరయ్యారు. వాటిని మర్రి జనార్దన్‌రెడ్డి శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. గ్రామస్థాయిలో పటిష్టం చేయడంలో కార్యకర్త పాత్ర కీలకమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండి, వారికి మద్దతుగా నిలవాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జోగు ప్రదీప్, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వేణుగోపాల్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, నాయకుడు స్వామి పాల్గొన్నారు. అదేవిధంగా బిజినేపల్లి మండలంలోని కారుకొండకు చెందిన భీముడి కుటుంబానికి రూ.2లక్షల పార్టీ బీమా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, శేఖర్‌రావు, శ్రీను తదితరులు ఉన్నారు.
నాగర్‌కర్నూల్/తిమ్మాజిపేట, ఫిబ్రవరి 7 : నాగర్‌కర్నూల్ మండలం నర్సాయిపల్లిలో ఇటీవల మృతిచెందిన ఎరక కుర్మయ్య కుటుంబా న్ని, తిమ్మాజిపేట మండలం అప్పాజిపల్లిలో గా యపడిన రవీందర్‌రెడ్డిని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. తిమ్మాజిపేటలో మాజీ జెడ్పీటీసీ కృ పానందం మనుమరాలు మృతిచెందడంతో ఆ యన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
బాలానగర్, ఫిబ్రవరి 7 : బాలానగర్ మం డల కేంద్రంలోని బాలికల గురుకులాన్ని డీ ఎస్పీ వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. గురువారం బాలికల గురుకులంలో నాగరకర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థిని ఆరాధ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం గురుకులానికి వచ్చిన డీ ఎస్పీ బాలిక ఆత్మహత్య చేసుకున్న తరగతి గదిని పరిశీలించారు. బాలిక బలవన్మరణానికి సంబంధించి అధ్యాపకులు, సిబ్బందితో మా ట్లాడారు. ఆత్మహత్యకు వినియోగించిన చీరను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.