చారకొండ, ఆగస్టు 18 : స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పల్లె ల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు గులాబీ సైనికులు సిద్ధంగా ఉండాలని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో కేఆర్కే ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం మాజీ సర్పంచ్ యాతం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అన్ని అబద్ధాలు, సాధ్యం కానీ హమీలతో ప్రజలను న మ్మించి మోసం చేసిందన్నారు. ప్రభుత్వం వారి వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు రో జుకో డ్రామా తెరలేపుతున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు కేసీఆర్ రాజకీయ భిక్ష పెట్టారని, ఆయన తన స్వార్థ రాజకీయ లబ్ధి కోసం పార్టీ మారినంత మాత్రా నా గులాబీ శ్రేణులు ఒక్కరూ కూడా ఆయన వెంట వెళ్లలేదన్నారు. కేసీఆర్ హయాంలో పల్లెల్లో ప్రగతి పరుగులు పెట్టేదని, రేవంత్‌రెడ్డి సర్కారులో గ్రామా లు అధోగతిపాలయ్యాయన్నారు.
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని భరోసా కల్పించారు. కార్యకర్తలకు ఏలాంటి సమస్యలు వచ్చిన కం టికి రెప్పలా కాపాడుకునేందుకు తమ వంతుగా కృషి చేస్తామని, అధైర్యపడ్డొదని ధైర్యంగా ముం దుకు సాగాలని మనోధైర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత, వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు, నేతలు మ నోహర్, మున్సిపల్ మాజీ చైర్మన్లు తులసీరాంనాయక్, నర్సింహాగౌడ్, నేతలు గజ్జెయాదయ్యగౌడ్, కమలాకర్‌రావు, రమేశ్, సలీం, చండీశ్వర్గౌడ్, తన్నీరు రామకృష్ణ, బొడ్డు శ్రీశైలం, సురేశ్‌గౌడ్, యాదగిరిగౌడ్, సవారి శ్రీనుగౌడ్, లక్ష్మణ్‌నాయక్, అనిశెట్టి శ్రీను, విజయ్‌గౌడ్, పర్వతాలు, శేఖర్‌గౌడ్, ఆంజనేయులు, జగపతి, బొజ్జయ్య, ఇదమయ్య, నారాయణరావు, సత్తయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వంగూరు, ఆగస్టు 18 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వంగూరు, చారకొండ మండలాల్లో గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ అచ్చంపేట ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వంగూరు మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు మర్రి, జైపాల్యాదవ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా మర్రి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌పై అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమ లు చేయలేక కుంటి సాకులు చెబుతున్నారన్నా రు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్న సీఎం రేవంత్ నిత్యం కేసీఆర్ జపం చేయకుండా ఉం డలేకపోతున్నారన్నారు. పార్టీలోకి కొంత మంది వ్యక్తు లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ పార్టీ శాశ్వతంగా ఉంటుందన్నారు. పార్టీని కాపా డే శక్తి ఒక కార్యకర్తలకు మాత్రమే ఉంటుందన్నారు. కార్యకర్తలు ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం కష్టపడాలని మేమంతా మీకు అండ గా వుంటామని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మె ల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ దేశం లో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో రైతులను ఆదుకున్న ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. సుమారు 60 లక్షల సభ్యత్వం కలిగిన బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నా యకులు పోకల మనోహర్, నర్సింహాగౌడ్, తులసీరాం, పర్వతాలు, నారాయణ్‌రావు, గణేష్‌రావు, రాజేందర్‌రెడ్డి, నరేందర్‌రావు, సురేందర్, శ్రీనివాస్‌యాదవ్, ప్రవీణ్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, శ్రీపతిరావు తదితరులు పాల్గొన్నారు.