నాగర్‌కర్నూల్, అక్టోబర్ 1 : కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, ప్రజాపాలన కొనసాగిస్తామని మాయమాటలు చెప్పి పేదలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బుల్డోజర్లతో వారి ఇండ్లనే కూలదోయడమే ప్రజాపాలనగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయోగిస్తున్న బుల్డోజర్లు ధనవంతులపైకి వస్తే బాగుండేదని, పేదల ఇండ్లపైకి రావడంతో తాము ఓటువేసి తప్పుచేశామనే మాటను పేదల నోటి నుంచే వినిపిస్తున్నాయన్నారు. ఆరు గ్యారెంటీల పేరిట అధికారంలోకి వచ్చి రెండింటిని మాత్రమే అమలు చేసి మిగతా వాటికి ఎగనా మం పెట్టారన్నారు.
రూ.4 వేల పింఛన్ మరిచారని, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఊసేలేదని, రుణమాఫీ మ ధ్యలోనే నిలిపివేశారని, గృహజ్యోతి అంతంతే అమలవుతుందని, డిసెంబర్ 9కే రూ.2 లక్షల రుణాలకు దరఖాస్తు చేసుకోమన్న వారు నేడు ఇచ్చిన రుణాలను మాఫీ చేయలేకపోగా మాయమాటలతో ప్రజల్ని మోసం చేశారన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ఇచ్చిన గ్యారెంటీలను ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో డైవర్షన్ పనులను ముందర పెట్టుకున్నారని విమర్శించారు. వరదబాధితులను పరామర్శించడానికి వెళ్లిన హరీశ్‌రావుపై రాళ్లదాడి, పేదలను పరామర్శించడానికి వెళ్లిన కేటీఆర్ కారుపై దాడి చేయడం సమంజసం కాదన్నారు.
మీ మాదిరి పదేండ్లలో మేము ఇలాగే ప్రవర్తిస్తే మీ రు బయట తిరిగేవారా, పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో ఓ కంపెనీతో మాట్లాడుకొని పేద ఇండ్లను కూల్చడమేపనిగా పెట్టుకున్నారన్నారు. రూ.15 వేల కోట్ల్లు సంపాదించాలన్న ఆలోచనతో, కుట్రబుద్ధితో కూలదోసుడుకు పూనుకున్నారన్నారు. మూసీపై ఇంత ప్రే మ ఎందుకు పుట్టుకొచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. చేతనైతే వేల మంది పేదల మూసి చుట్టూ ఉన్నారని ముందు వారికి ఇండ్లు కట్టించు అని సూచించారు. కష్టపడి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇల్లు నిర్మించుకుంటే కమర్షియల్ దందాను ముందరేసుకున్నారన్నారు. హైడ్రా వచ్చిందని చాలా మంది బిల్డర్లు భయపడి రాత్రి కలిసొస్తే ఉద యం వారివైపు హైడ్రా పోవడం లేదని, అమాయకులైన పేదల ఇండ్లను మాత్రం కూలదోస్తున్నారని విమర్శించారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో తండ్రీకొడుకులు తెలిసీ తెలియని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
వీరి వల్ల అధికారులు బలవుతున్నారని, ఇందుకు ప్రజలు నష్టపోతున్నారన్నారు. పదేండ్ల రాజకీయంలో తాను ఎక్కడా కక్షసాధింపుగా పోలేదని, రైతులకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టు పూర్తికోసం ప్రయత్నం చేశానని, మెడికల్ కాలేజీ కావాలని ప్రయత్నం చేశానని, జిల్లా కావడానికి ప్ర యత్నించినా, ఏదీ చేసినా ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ప్ర యత్నం చేశానని కక్షసాధింపులకు పోలేదన్నారు. తాను చే సిన అభివృద్ధి తప్పితే కొత్తగా మీరు చేసిందేమిటో చెప్పాలన్నారు. చేతనైతే జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీ తేవాలని అ న్నారు. పట్టణానికి చెందిన పాలమూరు శివ అనే యువకుడికి వినాయక నిమజ్జనం సందర్భంగా అరెస్టు చేయించారని, నిమజ్జనంలో అంతమంది ఉండగా ఒక్కడిపైనే కే సు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ కార్యకర్త అనే ఉద్దేశంతో కేసు పెట్టి జైలుకు పంపించారని, జైలుకు పంపినంత మాత్రాన కార్యకర్తలు భయపడరన్నారు. తొమ్మిది నెలల్లో తొమ్మిది మందిని జైలుకు పంపించావు కానీ అభివృద్ధి ఏమాత్రం చేయలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే జైళ్ల నుంచి, ఉద్యమాల నుంచి అని గుర్తు చేశారు. ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతం కాదని మళ్లీ మా రోజులు వస్తాయని, పోలీసులు నాయకుల మాటలు నమ్మి మీ ఉద్యోగాలకు ముప్పుతెచ్చుకోవద్దన్నారు. నాగర్‌కర్నూల్ మున్సిపల్ మీటింగ్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ లేకుండా నిధులు కేటాయించడం సరికాదన్నారు. ఈ విషయంలో ఎంతటి వరకైనా వెళ్తామన్నారు.
అన్ని వార్డులకు న్యాయం జరగాలని, కాంగ్రెస్ మున్సిపల్ సభ్యులు ఉన్నవార్డులకే నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. నేను చేసిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు, ఎవడో సంసారం చేస్తే పుట్టిన బిడ్డకు ముద్దుపెట్టుకున్నట్లు ఉంది మీ అభివృద్ధి అని ఎ ద్దేవా చేశారు. ఏదీ ఏమైనా నమ్మి ఓట్లేసిన ప్రజల్ని నట్టేట ముంచారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పులేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, అర్థం రవి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.