నాగర్‌కర్నూల్, జూలై 9 : రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో ఒక్క ఒటు కూడా మిస్ కాకుండా బీఎల్ఏలు జాగ్రత్త పడాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సూచించారు. గురువారం నాగర్‌కర్నూల్ రూరల్, పట్టణ బీఎల్ఏలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో నాగర్‌కర్నూల్ టౌన్లో 31 పోలింగ్ బూత్‌లు, రూరల్‌లో 39 పోలిం గ్ కేంద్రాల పరిధిలోని బూత్ లెవల్ ఏజెంట్లతో ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియపై సమీక్ష నిర్వహిచారు.
ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ త్వ రగా ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బీఎల్వోలతో డిజిటల్ చేయించాలని బీఎల్ఏలను ఆదేశించారు. సర్ కార్యక్రమంలో ఓటర్ల జాబితా స వరణలు, కొత్త ఓటర్ల నమోదు, మా ర్పులు, చేర్పులు, తొలగింపులు తదితర అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. సర్ కార్యక్రమంపై బీఎల్ఏలకు మరో వారం రోజుల తర్వాత సమీక్ష నిర్వహిస్తానని, అప్ప టి వరకు సర్ కార్యక్రమంలో బీఆర్ఎస్ బీఎల్ఏలు ముమ్మరంగా పాల్గొనాలని సూచించారు. వారంలోగా ఎన్యూమరేషన్ ఫారాలు అన్ని డిజిటలైజేషన్ పూర్తి కావాలని సూచించారు. సమావేశంలో నాగర్‌కర్నూల్ మండ ల, టౌన్‌కు సంబంధించిన బీఎల్ఏలు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.