కృష్ణ, మార్చి 18 : బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఈసారి కూడా గులాబీ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని హిందుపూర్ గ్రామ బసవేశ్వర కల్యాణ మండపంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజల ఆదరాభిమానాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి సారథ్యంలో టీఆర్ఎస్ నుంచి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్గా మార్చారన్నారు. ఈ క్రమంలో పార్టీని పటిష్టంగా మార్చేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే పార్టీశ్రేణులను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. అనంతరం కర్ణాటకకు చెందిన యువకులు, మాజీ ఉద్యోగులు 15 మంది బీఆర్ఎస్లో చేరగా.. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మె ల్యే ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండలాల అధ్యక్షులు విజయ్‌పాటిల్, మహిపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజనమ్మ, ఎంపీపీ పూర్ణిమా వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
గులాబీ గూటికి..
మక్తల్ టౌన్, మార్చి 18 : బీఆర్ఎస్తోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం పార్టీ నర్వ మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అధ్వర్యంలో కల్వాల గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా నేత ఆంజనేయులు గులాబీ పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెలే ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారన్నారు. కొత్త, పాత తేడా లేకుండా పార్టీశ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.