అమ్రాబాద్, సెప్టెంబర్ 1 : మండలంలోని మన్ననూర్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిపై ఉన్న మన్ననూర్ చెక్‌పోస్టును అచ్చంపేట డీఎస్పీ ఆదేశాల మే రకు మూసివేయడంతో శ్రీ శైలానికి రాకపోకలు నిలిచిపోయాయి.
దోమలపెంట, శ్రీశైలం ప్రాజెక్ట్ సమీపంలోని ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రయాణికులు వాయిదా వేసుకోవాలని పోలీసులు, అటవీశాఖ అధికారులు కోరుతున్నారు. ఘాట్‌రోడ్డుపై కొండచరియలు విరిగిపడడంతో నేషనల్ హైవే అధికారులు జేసీబీ సాయంతో బండరాళ్లను తొలగిస్తున్నారు.