ఖిల్లాఘణపురం, మే 27 : అప్పులబాధ తో భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా లో ఖిల్లాఘణపురం మండలంలోని సల్కలాపూర్ గ్రామ సమీపంలోని మామిడితోట వద్ద చోటుచేసుకున్నది. స్థానికులు కథనం ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన గంగల నర్సింహులు (40) ఆరేండ్ల కిందట తన భార్య ఎల్ల మ్మ (36), కుమారుడు సాయి నిహాల్ (15), కూతురు సాహితీశ్రీ (13)తో కలిసి ఖిల్లాఘణపురం మండలంలో మామిడితోటలను లీజుకు తీసుకొని వ్యాపారం చేస్తూ వచ్చాడు. వ్యాపారంలో రూ.60లక్షల నుంచి రూ.70లక్షలకు పైగా అప్పులు చేసినట్లు సమాచారం . కొన్ని అప్పులకు సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నట్లు తెలుస్తోంది.
ఈక్రమంలోనే అప్పుల బాధలు ఎక్కువ కావడంతో మంగళవారం నర్సింహులు భార్య, కూతురును తాము నివాసం ఉంటున్న సల్కలాపూర్లోని మామిడి తోటలో హతమార్చి నీటి సంపులో వేశాడు. దీనిని చూసిన కొడుకు పారిపోతుండగా కొడుకును పట్టుకొని కాళ్లు చేతులు కట్టేసి సంపులో వేశాడు. అ నంతరం బుధవారం తెల్లవారుజామున ఒకటిన్న ర గంటల సమయం లో తన బావమరిది వెంకటేశ్‌కు ఫోన్ చేసి అప్పుల బాధ భరించలేకపోతున్నాం, మీ అక్క, కోడలు ను చంపి వేశాను, నేను కూడా ఉరేసుకుంటున్నానని చెప్పి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువులు, గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో డీ ఎస్పీ గిరిబాబు, సీఐ శ్రీనివాసులు, ఎస్సై వెం కటేశ్లు పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థ లానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.
మామిడి రైతు కుటుంబంలో చోటుచేసుకున్న విషాద ఘటన రెండు మండలాల్లో తీవ్ర కలకలం రేపింది.ఈ ఘటనపై ఎస్సై వెంకటేశ్‌ను వివరణ కో రగా మృతుడు నర్సింహు లు బావ గద్వాలకు చెం దిన తెలుగు వెంకటేశ్ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసిన ట్లు తెలిపారు. తన బావమరిది న ర్సింహులు కొంతకాలంగా అప్పులతో బాధపడతున్నాడని తెలిపారు. ఈ క్రమంలోనే తన భార్య ఎల్లమ్మ, కుమారుడు, కుమార్తెను హత్య చేసిన తాను ఉరేసుకొని ఆత్మహత్య పా ల్పడ్డాడన్నారు. నర్సింహులుకు ఉన్న అప్పుల విషయంలో కొంతమంది వేధింపులు ఉన్న ట్లు తన వాట్సా ప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడని, ఈ ఘటనకు కారకులైన వారిని శిక్షించాలని వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
డోకూరులో విషాదం
కౌకుంట్ల(దేవరకద్ర), మే 27 : అప్పుల బాధ తాళ్లలేక దేవరకద్ర మండలం డోకూర్ గ్రామానికి చెందిన గంగల నర్సింహ వనపర్తి జిల్లాలోని ఖిల్లా ఘణపురం మండలం సల్కలాపూర్లో భార్య, పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కౌలు రైతు ఆత్మహత్య బాధకరం : ఆల
కౌలు రైతు నర్సింహులు అప్పుల బాధతో భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నర్సింహు లు కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవడంపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన మార్చురీ వద్ద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.