కౌకుంట్ల(దేవరకద్ర), మే 6 : లారీ, డీసీఎం, బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం చోటు చేసుకున్నది. దేవరకద్ర ఎస్సై నాగన్న కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని పెద్దగోప్లాపూర్ వద్ద మహబూబ్‌నగర్- రాయచూర్ రహదారిపై ఉన్న స్పీడ్ బ్రేకర్స్ వద్ద హైదరాబాద్ నుంచి సింధనూరుకు ట్రాన్స్పోర్ట్ లోడుతో వెళ్తున్న డీసీఎంను రాయిచూరు వైపు వెళ్తున్న లారీ డీసీఎంను అతి వేగంగా వెనుక నుంచి ఢీ కొట్టడంతో, రాయచూరు నుంచి హైదరాబాద్‌కు వస్తు న్న పెళ్లి బస్సును ఎదురుగా వచ్చి ఢీకొట్టిం ది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ, డీసీఎం డ్రైవర్‌కు గాయాలయ్యాయి. లారీ, డీసీఎం వాహనాలు రోడ్డు పై బోల్తా పడ్డాయి. లారీ డ్రైవర్ తీవ్ర గా యాలతో లారీలో ఇరుక్కపోయాడు. దేవరకద్ర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లారీలో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్‌ను బయటికి తీసి చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో జిల్లా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
ప్రమాదం జరిగిన సమయంలో మక్తల్‌కు వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి ఘటనా స్థలాన్ని పరిశీలించి రోడ్డు ప్రమాదాలు జరుగకుండా సిగ్నల్స్ ఏర్పా టు చేసి తగిన చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.