మొహాలీ: సిక్కు ఖైదీలను విడుదల చేయాలంటూ శనివారం చండీగఢ్‌లో ‘క్వామీ ఇన్సాఫ్ మోర్చా’ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు డ్రోన్లను ఉపయోగించి టియర్‌గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. మరికొన్ని చోట్ల ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తుపాకులు, జల ఫిరంగులను ఉపయోగించారు. శాంతియుత నిరసన ర్యాలీపై పోలీసులు బలప్రయోగానికి దిగటం, తమ డిమాండ్లపై ప్రభుత్వం తీరును నిరసిస్తూ క్వామీ ఇన్సాఫ్ మోర్చా ఈ నెల 21న పంజాబ్ బంద్‌నకు పిలుపునిచ్చింది. మాజీ సీఎం బియాంత్ సింగ్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జగ్తార్ సింగ్‌ను పెరోల్‌పై విడుదల చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్న శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సిమ్రన్‌జిత్ సింగ్ మను సహా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.