మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 1: ఉమ్మడి జిల్లా ప్రజలకు సంజీవనిలా ఉన్న మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానలో మాత్రల కొరత నెలకొన్నది. కొన్ని నెలలుగా ప్రభుత్వం నుంచి మందల సరఫరా నిలిచిపోవడంతో ఉన్న మందులే సర్దుబాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో యాంటీబయోటిక్, ఆపరేషన్లకు సంబంధించిన మందులు కావాలంటే బయట కొని తెచ్చి ఇస్తున్నారు. వాటి బకాయిలు కూడా రూ.లక్షల్లో ఉన్నాయి. అయితే మీరు ఇవ్వకపోయినా బయటకు రాసి ఇస్తే తీసుకొస్తామని రోగులు అడుగుతున్నా , రాసి ఇస్తే ఏమవుతుందోనని రోగులు రోజుల తరబడి దవాఖానలోనే ఉంటున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే… ఆసుపత్రి అధికారులు మాత్రం అన్ని మందులూ ఉన్నాయి అని చెబుతుండడం గమనార్హం . ఉమ్మడి జిల్లాల నుంచి సైతం రోగులు ఇక్కడికి వస్తున్నారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానలకు మించి మందులు, ఇంజెక్షన్లు ఎక్కువగా అవసరమయ్యేవి. జనరల్ దవాఖానకే జిల్లా నలుమూలల నుంచి కాకుండా ఉమ్మడి జిల్లాల నుం చి సైతం రోగులు ఇక్కడికి వస్తున్నారు. ప్రతిరో జు 1200నుంచి 1500 వరకు ఓపీతోపాటు దాదాపు 500మంది వరకు ఆడ్మిట్ అయ్యే రో గులు ఉంటున్నారు. సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం, గ్యాస్, వాంతులు, విరేచనాలకు సైతం మాత్రలు లేని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వివిధ ఆపరేషన్లు, ఇన్ఫెక్షన్లకు వినియోగించే యాంటీబయోటిక్ ఇంజక్షన్లు కూడా లేని దుస్థితి ఏర్పడింది.
ఇండెంట్‌కు తగ్గ ఇవ్వని మందులు, ఇంజక్షన్లు
ప్రభుత్వం నుంచి మందుల సరఫరా లేకుంటే దవాఖాన అధికారులు బయట కొని తెచ్చివ్వాలనే నిబంధ న ఉంది. ఆ మేరకు ఆవసరమైన యాంటీబయాటిక్, సరఫరా లేని మందులు, ఇంజెక్షన్లు కొనితెచ్చి రోగులకు ఇస్తున్నారు. అయినా అ వి కూడా సరిపోవడం లేదు. అరకొరగా మం దులు తెచ్చి అన్ని విభాగాలకు పం పిస్తున్నా రు. అయితే ఇండెంట్‌కు తగ్గట్లుగా మందులు ఇంజెక్షన్లు ఇవ్వడం లేదు.
మందులు ఇవ్వరు.. బయటికి రాయరు
ప్రభుత్వం నుంచి మందుల సరఫరా లేకపోవడంతో ఉన్న మందులతోనే డాక్టర్లు సర్దుబాట్లు చేస్తున్నారు. రోగులకు ఆ మందులు సరిపోవడం లేదు. కనీసం బయటకు రాసిద్దామంటే అలా చేయొద్దని కచ్చితమైన ఆదేశా లు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో రోగి జ బ్బు నయం చేయడం ఎలాగని డాక్టర్లు లో లోపల మదనపడుతున్నారు. బయటకు రా సిస్తే తెచ్చుకునేందుకు రోగులు సిద్ధంగా ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.
చెయ్యినొప్పి వస్తుందని వచ్చిన. ఇక్కడ డాక్టర్లు చూసి మందులు రా సిండ్రు. దవాఖానలో మందులు కొన్ని ఇచ్చారు.. లేనివి బయట తీసుకోండని.. చీ టీ మీద రెడ్ పెన్నుతో టిక్‌లు కొట్టి ఈ మం దులు లేవని చెపుతుండ్రు. ఇక్కడ అన్నిరకాల మం దులు ఉచితంగా ఇస్తారని వస్తే.. లేవని చెబుతున్నారు.
– శారద , న్యూగంజ్, మహబూబ్‌నగర్
మూడే మాత్రలిచ్చిండ్రు..
పెద్దాసుపత్రిలో అన్ని మందులుంటాయని వస్తే డాక్టర్ చూసి తలనొప్పికి మందులు రాస్తే అందులో 5 మందులకు మూ డు గోళీలిచ్చారు. మిగతావి మా దగ్గర స్టాక్ లేదు. బ యట తీసుకొండి.. అని టిక్కులు కొట్టినా మందుల చిట్టీ నాకు ఇచ్చారు. గతంలో అన్ని మందులు ఇ క్కడ ఇచ్చేవి. దూర ప్రాంతాల నుంచి వచ్చినా మాకు మందు గోళీలు లేవంటుండ్రు.
– లక్ష్మీ, ఖానాపూర్