కోస్గి, జూలై 16 : ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ను ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి శనివారం కలిశారు. హైదరాబాద్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులనుపై చర్చించారు. సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను పట్టించుకోకుండా కలిసికట్టుగా అందరూ పార్టీ అభివృద్ధికి కృషిచేయాలని అపోహలు,అభ్యంతరాలు పెట్టుకోవద్దని మంత్రి ఎమ్మెల్యేలకు సూచించారు.
పుకార్లు నమ్మొద్దు : ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి
పట్నం సోదరులు ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి పార్టీ మారుతున్నారన్న పుకార్లు నమ్మొవద్దని ఓర్వలేకనే ఇతర పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. పట్నం సోదరులు నిబద్ధతతో కూడిన, పార్టీకోసం అంకితభావంతో పనిచేసే నాయకులమన్నారు. తమను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు.