హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని ఈనెల 15న హైదరాబాద్ బంజారాభవన్‌లో ఘనంగా నిర్వహించనున్నట్టు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జయంతి ఉత్సవాల్ల్లో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. ఉత్సవాల్లో భాగంగా సంత్ సేవాలాల్ ఆరాధన, గిరిజన సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.