భారత సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణతోపాటు హిందూధర్మ స్థాపనలో సేవాలాల్ మహరాజ్ కృషి ఎనలేనిదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు.
మెదక్ జిల్లాలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని గిరిజన తండాల్లో ఘనంగా గురువారం నిర్వహించారు. గిరిజన మహిళలు బోనాలతో సేవాలాల్ ఆలయాలకు చేరుకుని భోగ్భండార్ పూజలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ బంజారుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.