సేవాలాల్ మహరాజ్ బోధనలు స్ఫూర్తిదాయకం..
భారత సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణతోపాటు హిందూధర్మ స్థాపనలో సేవాలాల్ మహరాజ్ కృషి ఎనలేనిదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు.
- ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు
- పలు ప్రాంతాల్లో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు
మియాపూర్, ఫిబ్రవరి 15: భారత సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణతోపాటు హిందూధర్మ స్థాపనలో సేవాలాల్ మహరాజ్ కృషి ఎనలేనిదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. గురువారం సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్, నడిగడ్డ తండాలో బంజారా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల ఆరాధ్య దైవం, వారి అభ్యున్నతి , శ్రేయస్సు కోసం అలుపెరగని పోరుసల్పిన మహనీయుడు సేవాలాల్ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ విశేష కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి నాయక్, తిరుపతినాయక్, హన్మంతు నాయక్, సీతారాం, దశరథ్ నాయక్, తుకారాం, లక్ష్మణ్, కృష్ణ, గోపి, చందు, తదితరులు పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీలో..
కేపీహెచ్‌బీ కాలనీ: బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ బోధనలు స్ఫూర్తిదాయకమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం బాలాజీనగర్ డివిజన్ సేవాలాల్నగర్లో.. అల్లాపూర్ డివిజన్ పర్వత్నగర్లలో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, కూకట్పల్లి తాసీల్దార్ స్వామి, కార్పొరేటర్ సతీశ్‌గౌడ్, బంజారా పాల్గొన్నారు.
బాలాజీనగర్ డివిజన్లో..
బాలాజీనగర్ డివిజన్, సేవాలాల్నగర్లో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబూరావు , నేతలు హరినాథ్, శంకర్ నాయక్, కైలా నాయక్, హైమావతి, భీమ్రావు, స్వామిగౌడ్, వెంకట్రావ్, సుశీల్‌కుమార్ తదితరులున్నారు.
కొండాపూర్‌లో..
కొండాపూర్: బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని గురువారం చందానగర్ హుడా కాలనీలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
దుండిగల్‌లో..
దుండిగల్: సంత్‌సేవాలాల్ జయంతి వేడుకలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఘనంగా జరిగాయి. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, 20వ డివిజన్ కార్పొరేటర్ బాలాజీనాయక్ ఆధ్వర్యంలో బాచుపల్లిలో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కొలన్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నేతలతోపాటు నిజాంపేట్ కార్పొరేషన్ బంజారసేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొలన్ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు సైతం సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు.
అల్లాపూర్‌లో..
అల్లాపూర్: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్‌నగర్ కమ్యూనిటీహాల్ లో డివిజన్ ఎస్టీ సెల్ నాయకుల ఆధ్వర్యంలో గురువారం సంత్‌సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సబీహాబేగం, బీఆర్ఎస్ నాయకులు,ఎస్టీ సెల్ నాయకులు బద్రునాయక్, గోపాల్ నాయక్, కళ్యాణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

