నర్వ, జూలై 16: రైతుబంధు పథకంతో తనకు వచ్చిన రూ.2,50,000ను విరాళంగా అందజేశారు. మండలానికి చెందిన సింగిల్‌విండో చైర్మన్ బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి మండలంలోని సీపూర్, జక్కన్నపల్లి గ్రామాల రోడ్డు మరమ్మతు పనులకు దళితబంధు డబ్బులను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా విండో చైర్మన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి, రైతుల సంక్షేమానికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నా రు. రెండేండ్లుగా వస్తున్న రైతుబంధు డబ్బులను వివిధ ప నులకు విరాళంగా అందిస్తున్నందునా రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మండ్ల చిన్నయ్య ఆధ్వర్యంలో పలువురు రైతులు, ప్రజాప్రతినిధు లు శనివారం నర్వ విండో కార్యాలయంలో శాలువా,పూలమాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో విండో వైస్ చైర్మ న్ లక్ష్మన్, సీపూర్ ఉపసర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు రైతులు రామకృష్ణారెడ్డి, సుదర్శన్‌గౌడ్, సత్యన్న, రాంరెడ్డి, బుచ్చరెడ్డి, సం గం నర్సింహులు, హన్మంతురెడ్డి, సుధీర్ పాల్గొన్నారు.