బాలానగర్, జూలై 16 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తండాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నాయని గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్ అన్నారు. మండలంలోని అప్పాజిపల్లిలో శనివారం పంచాయతీ నిధులతో సీసీరోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ కమలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తండాలకు మంచిరోజులు వచ్చాయన్నారు. తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపాటు అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపా రు. ప్రభుత్వ సహకారంతో అన్ని తండాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు రమేశ్నాయక్, శారద, ఎంపీటీసీ సుగుణ, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు.