ఉండవెల్లి, జూలై 15 : అలంపూర్ చౌరస్తా 44వ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న 100 పడకల దవాఖాన పనుల్లో ఉన్న నాణ్యతా లోపాలను సవరించాలని ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథం కాంట్రాక్టర్లకు సూచించారు. వంద పడకల దవాఖాన పనులను శుక్రవారం మంద పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన సిమెంట్, ఇటుక, స్టీల్ కాకుండా ఇతర కంపెనీల మెటీరియల్‌ను ఎందుకు వాడుతున్నారో చెప్పా లని ఇంజినీర్ అధికారులను ప్రశ్నించారు. నాణ్యతలో రాజీ లేకుండా పనిచేయాలని సైట్ ఇంజినీర్లకు సూచించారు.
అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆయన విలేకరులతో మాట్లాడారు. దవాఖాన పనుల వద్ద ఇంజినీర్ అధికారులు అందు బాటులో లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా, నాణ్యత లేకుండా పిల్లర్లు, స్లాబ్ వర్క్, గోడలు నిర్మిస్తున్నారన్నారు. దీంతో ప్రారంభానికి ముందే పగుళ్లు ఏర్ప డుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దవాఖాన నిర్మాణంలో నాణ్యతపై సీఎం కేసీ ఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. నియోజకవర్గ బిడ్డగా విద్య, వైద్యం, మండలాలు, ము న్సిపాలిటీల అభివృద్ధి కోసం పాటుపడుతానన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి మంద శ్రీనాథ్, నాయకులు శంకర్‌రెడ్డి, ఆత్మలింగారెడ్డి, లోకేశ్వర్‌రెడ్డి, ఏకాంత్, బలరాముడు, దిలీప్, రఘు, భరత్ పాల్గొన్నారు.