గండీడ్, జూలై 15 : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంలాంటిదని పరిగి ఎ మ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. గం డీడ్ ఉమ్మడి మండలంలోని గాధిర్యాల్, చీకర్లబండతండాకు చెందిన పలువురికి శుక్రవారం మండలకేంద్రంలో సీఎం సహాయనిధి చెక్కులను పం పిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్యం ఇతర కారణాలతో ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం పొందే పేదలను ముఖ్యమం త్రి సహాయనిధితో ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటున్నదని తెలిపారు. ఆపత్కాలం లో అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కా ర్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భిక్షపతి, పెంట్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.