నారాయణపేట, జూలై 15 : పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పట్టణంలోని కొండారెడ్డిపల్లి చెరువు మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు, వైకుంఠధామం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.4 కోట్లతో కొండారెడ్డిపల్లి చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న మినీ ట్యాంక్‌బండ్ పనులలో భాగంగా రహదారి ఏర్పాటు చేసి రహదారికి ఇరువైపులా మొక్కలు పెంచి సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా బతుకమ్మలను నిమిజ్జనం చేసేందుకు, వినాయక విగ్రహాలను నిమిజ్జనం చేసేందుకు వేర్వేగా ఘాట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా దామరగిద్ద రోడ్డు నుంచి చెరువు వరకు సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టనున్నామన్నారు. పట్టణంలో ని ఆధునిక వసతులతో వైకుంఠధామం నిర్మిస్తామన్నారు. ఎర్రగుట్ట వద్ద మెకనైజింగ్ లాండ్రి పనులను త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
దళితబంధు విప్లవానికి నాంది పలుకుతుంది దళితబంధు పథకం బలమైన సా మాజిక విప్లవానికి నాంది పలుకుతుందని ఎమ్మెల్యే అన్నారు. మండలంలో ని భైరంకొండ గ్రామానికి చెందిన రా జుకు దళితబంధు పథకం కింద షిఫ్ట్ డిజైర్ కారు మంజూరయింది. క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారుడికి కారు పంపిణీ చేశారు.
పేదలకు అండగా ప్రభుత్వం
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ఎమ్మె ల్యే అన్నారు. పట్టణంలోని బాహర్పేటకు చెందిన అజీజ్ అహ్మద్‌కు సీఎం సహాయ నిధి నుంచి రూ.2,50,000 మంజూరయ్యాయి. క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే లబ్ధిదారుడికి చెక్కును అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మా ర్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ జగదీశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షు డు విజయ్‌సాగర్, ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సుభాశ్, కౌన్సిలర్ గురులింగప్ప, నాయకులు తదితరులు పాల్గొన్నారు.