నారాయణపేట, జూలై 15 : కేసులపై సమగ్ర విచారణ నిర్వహించి, నిందితులకు శిక్ష పడేలా చేయడంతోపాటు నే రాలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో శుక్రవారం నేర సమీక్షపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఫోక్సో కేసుల్లో సమగ్ర విచార ణ చేపట్టి, త్వరితగతిన శిక్షలు పడేలా చేయాలన్నారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించేలా చూడాలన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల ని, చట్ట వ్యతిరేక కార్యాకలాపాలు నిర్వహించే వారిపై ని ఘా ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏ ర్పాటుపై అవగాహన కల్పించాలని, స్టేషన్ వచ్చే బాధితులపై మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. మహిళలతో అనుచితంగా ప్రవర్తించినా, ఎవరిపైనా ఆరోపణలు వచ్చినా సహించేది లేదని తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, వెంకటేశ్వరావు, సీఐలు శ్రీకాంత్‌రెడ్డి, సీత య్య, జనార్దన్, రామ్‌లాల్, ఎస్సైలు సురేశ్, రాములు, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
10 మంది బాల కార్మికులకు విముక్తి
ఆపరేషన్ ముస్కాన్ 8లో భాగంగా జిల్లాలోని మక్తల్ మండలంలో బృందం దాడులు నిర్వహించి వ్యవసాయ పొలంలో పని చేస్తున్న 10 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ తెలిపారు. అందు లో 6 మంది బాలికలు, 4 మంది బాలురు ఉన్నట్లు పేర్కొన్నారు. వారందరిని సీడీపీవో ఆఫీస్‌లో అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ ఎదుట హాజరు పర్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు బాలలను కార్మికులుగా పెట్టుకున్న యజమానులకు జరిమానా విధించనున్నట్లు ఎస్పీ చెప్పారు.