మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 14 : దోస్త్ ద్వారా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం విద్యార్థుల ముందుంచింది. ఇందుకోసం విద్యార్థులు ముందుగానే తమ ఆధార్‌కు ఫోన్ నంబర్‌ను లింక్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. టీ-యాప్ ద్వారా https://dost.cgg.gov.in విద్యార్థులు లాగిన్ కాగానే వారికి దోస్త్ ఐడీ, పిన్ నంబరు వస్తుంది. వీటిని ఉపయోగించి దరఖాస్తు పూర్తి చేసుకోవాలి. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కోరుకున్న కళాశాలలో సీటు వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఏ దశ కౌన్సెలింగ్‌లో అయినా సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా ఎంపిక చేసుకున్న కాలేజీకి వెళ్లి ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
తొలి దశ రిజిస్ట్రేషన్ : జూలై 1 నుంచి 30 వరకు
వెబ్ ఆప్షన్ల నమోదు : జూలై 6 నుంచి 30
ధ్రువపత్రాల పరిశీలన : జూలై 28, 29
సీట్ల కేటాయింపు : ఆగస్టు 6
సెల్ఫ్ రిపోర్టింగ్ : ఆగస్టు 8 నుంచి 18 వరకు
రెండో దశ రిజిస్ట్రేషన్ : ఆగస్టు 7 నుంచి 21 (రూ.400తో)
వెబ్ ఆప్షన్ల నమోదు : ఆగస్టు 7 నుంచి 22
సీట్ల కేటాయింపు : ఆగస్టు 27
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ : ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ దాకా
మూడో దశ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల నమోదు : ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు
సీట్ల కేటాయింపు : సెప్టెంబర్ 16
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ : సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 22 వరకు
ఓరియెంటేషన్ : సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు
అక్టోబర్ 1 నుంచి తరగతులు..
సేవా కేంద్రాల్లో ఉచిత సేవలు..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ, ఎంవీఎస్ డిగ్రీ కళాశాలల్లో దోస్త్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కూడా కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో విద్యార్థులు ఆధార్‌తోపాటు ఫారం కోసం రూ.200 చెల్లిస్తే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లో ఉన్న అధ్యాపకులు రిజిస్ట్రేషన్‌తోపాటు వెబ్ ఆప్షన్లు కూడా పెడతారు. ఈ క్రమంలో విద్యార్థులకు నచ్చిన కళాశాల ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా విద్యార్థులు తామే రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రమంలో ఏవైనా తప్పులు జరిగినా ఈ కేంద్రాల ద్వారా సరిదిద్దుకునే అవకాశం ఉన్నది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
విద్యార్థులకు ఉచిత సేవలు..
పీయూ, ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన దోస్త్ సేవా కేంద్రాల్లో విద్యార్థులకు ఉచితంగా సేవలందిస్తున్నాం. రిజిస్ట్రేషన్‌తోపాటు వెబ్ఆప్షన్ ఎంపికను విద్యార్థుల ఇష్టానుసారం చేస్తున్నాం. విద్యార్థులు సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో తప్పులు జరిగితే.. ఉచిత సేవా కేంద్రాలకు వచ్చిన సవరించుకునే అవకాశం ఉన్నది. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం ఈ కేంద్రం పనిచేస్తుంది. ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబగద్వాల, నారాయణపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో దోస్త్ సేవా కేంద్రాలు ఉన్నాయి.
– ప్రొఫెసర్ గిరిజామంగతాయారు, పీయూ రిజిస్ట్రార్
పారదర్శకంగా ఎంపిక..
దోస్త్ వెబ్సైట్లో విద్యార్థులు పారదర్శకంగా కళాశాల ఎంపిక చేసుకోవచ్చు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉచితంగా సేవలు అందిస్తున్నాం. వెబ్ఆప్షన్లు పెట్టుకునే క్రమంలో విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో అన్ని సౌకర్యాలు, అధ్యాపకులు, కోర్సులు పరిశీలించి కళాశాలను ఎంపిక చేసుకోవాలి.
– డా.విజయ్‌కుమార్, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, దోస్త్ కన్వీనర్