భూత్పూర్, జూలై 14 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసే పార్టీలో భా రీగా చేరుతున్నట్లు ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డుకు చెందిన బీజేపీ,కాంగ్రెస్ నాయకులు 50మంది యువకులు అన్నాసాగర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులను ప్రజలు బాగా గమనిస్తున్నారని తెలిపారు. బీజేపీ అభివృద్ధిని విస్మరించి మతతత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. భూత్పూ ర్ నియోజకవర్గంలో ఏ చెక్ డ్యాం చూసినా జలకళ సంతరించుకుందంటే టీఆర్ఎస్ వల్లే సాధ్యం అయిందన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ కెంద్యాల శ్రీనివాస్, కౌన్సిలర్ రామకృష్ణ, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్‌గౌడ్, సాయిలు, నాయకులు సత్యనారాయణ, రాము, వెంకటేశ్, బాలరాజు, జయపాల్, శివ తదితరులు పాల్గొన్నారు.