Insurance | హోంగార్డు కుటుంబానికి రూ. 34 లక్షల బీమా అందజేత
Insurance | విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి పోలీస్ శాఖ, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా బీమా పరిహారాన్ని అందజేశాయి.
హైదరాబాద్ : విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి పోలీస్ శాఖ, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా బీమా ( Insurance ) పరిహారాన్ని అందజేశాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుగా విధులు నిర్వహించిన ఎం. వెంకటేశ్ ( Home Guard venkatesh ) గతేడాది ఏప్రిల్ 27న జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
హోంగార్డు విభాగంతో యాక్సిస్ బ్యాంక్ ( Axis Bank ) కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, వేతనం అకౌంట్ కలిగిన సిబ్బందికి వర్తించే ప్రమాద బీమా సౌకర్యం కింద రూ. 34 లక్షల పరిహారం మంజూరైంది. ఈ సందర్భంగా డిజిపి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ హోంగార్డ్స్ డీజీపీ స్వాతి లక్రా చేతుల మీదుగా చెక్కును మృతుడి భార్య కొడిగంటి స్వాతికి అందజేశారు.
ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి పోలీసు శాఖ తరపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. విపత్కర సమయంలో బాధిత కుటుంబానికి సకాలంలో ఆర్థిక సాయం అందించిన యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, బ్యాంక్ ప్రతినిధులు, హోంగార్డ్ రీజియన్ కమాండెంట్ వెంకటేశ్వర్లు, ఏవో సాయి కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

