US vs Iran | మేం ఎవరికీ భయపడం.. యురేనియం శుద్ధిపై తగ్గేదే లేదన్న ఇరాన్
US vs Iran | అగ్రరాజ్యం అమెరికా (USA) తో అణు చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ (Iran) కీలక వ్యాఖ్యలు చేసింది. యురేనియం శుద్ధిపై తాము వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేసింది. తమను ఎవరూ భయపెట్టలేరని, తాము ఎవరికీ భయపడేది లేదని అగ్రరాజ్యంపై కవ్వింపులకు పాల్పడింది.
US vs Iran : అగ్రరాజ్యం అమెరికా (USA) తో అణు చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ (Iran) కీలక వ్యాఖ్యలు చేసింది. యురేనియం శుద్ధిపై తాము వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేసింది. తమను ఎవరూ భయపెట్టలేరని, తాము ఎవరికీ భయపడేది లేదని అగ్రరాజ్యంపై కవ్వింపులకు పాల్పడింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బా అరాఘ్చి (Abbas Araghchi) ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా (USA) పై తమకు పెద్దగా నమ్మకం లేదని, యురేనియం శుద్ధిపై తామెందుకు వెనక్కి తగ్గాలని అరాఘ్చి అన్నారు. ఒకవేళ తమపై యుద్ధం ప్రకటించినా తాము దాన్ని వదిలేయబోమని చెప్పారు. తమను శాసించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ ప్రాంతంలో వారి (అమెరికా) సైనిక మోహరింపు తమను భయపెట్టలేదని చెప్పారు. అమెరికాతో చర్చల గురించి తమ వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలైన చైనా, రష్యాను కూడా సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు.
ఒమన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య ప్రస్తుతం పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. అణు కార్యక్రమంపై భవిష్యత్ సంప్రదింపులకు బాటలు వేసేందుకే ఇరు దేశాలు ఈ చర్చల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తమ సైనిక మోహరింపును పెంచుతోంది. అణు ప్రణాళికలకు సంబంధించి ఇరాన్పై ఒత్తిడి పెంచే ఉద్దేశంతోనే ఈ మోహరింపులు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఒకవేళ చర్చలు విఫలమైతే దాడులకు దిగుతామని ఈ సైనిక మోహరింపు ద్వారా అగ్రరాజ్యం సంకేతాలిచ్చింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

