దేవరకద్ర రూరల్, జూలై 14 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. దేవరకద్ర రైతువేదికలో గురువారం అధికారులు, సర్పంచులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రా మాల్లో ఇండ్లు లేని పేదలు, వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను గుర్తించి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ భవనాల్లో వసతి కల్పించాలని సూచించారు. అలాగే దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు. వర్షాలతో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్త చర్య లు చేపట్టాలని కోరారు.
అనంతరం చిన్నచింతకుంట మండలంలోని వాగులో కురుమూర్తి వరకు నిర్మిస్తున్న బ్రిడ్జి, చెక్ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించా రు. కురుమూర్తిస్వామి ఉద్దాలోత్సవం నాటికి బీటీరోడ్డు పనులను పూర్తి చేయాలన్నారు. అలాగే జెడ్పీ నిధుల నుంచి అ ప్పంపల్లికి రూ.7లక్షలు, ఏదులాపూర్కు రూ.5లక్షలు, దాసర్‌పల్లికి రూ.5లక్షలు మంజూరు కాగా, ఎమ్మెల్యే ఆల ప్రొసీడింగ్స్ అందజేశారు. అనంతరం ఉంద్యాలకు చెందిన ప్రభాకర్‌కు దళితబంధు పథకం నుంచి మంజూరైన కారును ఎమ్మెల్యే అందజేశారు. కాగా, అమెరికా పర్యటనను ముగించుకొని మొదటగా దేవరకద్రకు వచ్చిన ఎమ్మెల్యే ఆలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఎంపీపీలు రమాదేవి, హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి, తాసిల్దార్ జ్యోతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, కోట రాము, శ్రీకాంత్‌యాదవ్, కొండా శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీలు పంపిణీ
భూత్పూర్, జూలై 14 : మూసాపేట మండలం తాళ్లగడ్డకు చెందిన సుశీల, అడ్డాకుల మండలం పొన్నకల్‌కు చెందిన వెంకటయ్యకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన ఎల్వోసీలను గురువారం అన్నాసాగర్‌లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అందజేశారు. సీఎం సహాయనిధి నుంచి సుశీలకు రూ.లక్షా 25వేలు, వెంకటయ్యకు రూ.లక్ష ఎల్వోసీ మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగార్జునరెడ్డి, నాయకులు మహమూద్, లక్ష్మీనర్సింహయాదవ్, శివరాజు తదితరులు పాల్గొన్నారు.