మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 6 : రా ష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘మన ఊ రు-మనబడి’ పథకం కింద అదనపు త రగతి గదులతోపాటు కిచెన్ షెడ్, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కోట్లు కేటాయించిందని ఆబ్కారీ, క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్‌పల్లిలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో రూ.3.20కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ, టీడీగుట్ట హైస్కూల్లో రూ.32లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమ లు కానున్నాయని తెలిపారు. పనులు వేగవంతం చేయాలని, పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. కళాశాలలో స్టేడియంతో పాటు యోగాషెడ్ నిర్మించాలన్నారు. అనంతరం టీడీగుట్ట పాఠశాల లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించా రు. మెనూ అమలులో నిర్లక్ష్యం వహిస్తే, ఆహారంలో నాణ్యత లోపిస్తే తక్షణమే చ ర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, మున్సిపల్ వై స్ చైర్మన్ తాటిగణేశ్, డీఈవో రవీందర్, ప్రిన్సిపాల్ శివలీల, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్లు రాణి, మాధవీలత, నరేందర్, మునీర్,రామ్, నాయకులు రాజు, మోషిన్, రాములు, చిన్న పాల్గొన్నారు.
మహానేత జగ్జీవన్‌రాం..
మహబూబ్‌నగర్, జూలై 6: నిరంత రం ప్రజల సంక్షేమానికి పరితపించే దేశం గర్వించదగ్గ నేత డాక్టర్ బాబు జగ్జీవన్‌రాం అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అ న్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రాం వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ స్వాతంత్య్ర సమరయోధుడు, సం ఘ సంస్కర్త, ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించి ప్రజలకు ఎంతో మేలు చేశారని కొనియాడారు. అణగారిన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని, పార్లమెంట్లో వివిధ పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా అందరి మన్ననలు పొందారని తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నేతలు జంబులయ్య, మల్లెపోగు శ్రీనివాస్ మాదిగ, బాలరాజు పాల్గొన్నారు.
సమాజసేవలో ముందుడాలి..
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూలై 6 : సమాజ సేవలో ముందుండాలని మం త్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేం ద్రంలోని బ్రాహ్మణవాడిలో ఉన్న వాసవీ కల్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం, మలక్‌పేట యశోద దవాఖాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్యవైశులు సేవాభావంతో ఇలాంటి వై ద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు వెంకటేశ్, వేణుగోపాల్, నాగరాజు, ప్రమోద్‌కుమార్, చక్రధర్ గుప్తా, వెంకటరమణ, ప్రభులింగం పాల్గొన్నారు.