కొల్లాపూర్, జూలై 6 : అటవీ ప్రాంతంలో అక్రమ సాగు చేస్తుండగా అధికారులు అడ్డుకోవడంతో మనస్తాపానికి గురై మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన మండలంలోని ముక్కిడిగుం డం శివారులోని మ్యాదరబండ ప్రాంతంలో చో టు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ము క్కిడిగుండం గ్రామానికి చెందిన మూడావత్ గో పాల్, చంద్రు అన్నదమ్ములు. వీరు గ్రామ శివారులోని మ్యాదరిబండ అటవీ ప్రదేశంలో 35 ఏం డ్ల నుంచి సుమారు ఐదెకరాల అటవీ భూముల ను అక్రమంగా సాగు చేసుకుంటున్నారు.
ఈ క్ర మంలో మంగళవారం రాత్రి వర్షం కురవడంతో సదరు రైతులు విత్తనాలు విత్తుతున్నారు. ఈ సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ వారిని అడ్డుకున్నారు. దీం తో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. అటవీ శాఖ అధికారుల తీరుపై మనస్తాపానికి గురైన మూడావత్ చంద్రు భార్య దేవమ్మ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబసభ్యులు వెం టనే అంబులెన్స్‌లో కొల్లాపూర్ ప్రభుత్వ సివిల్ ద వాఖానకు తరలించారు. ఆమెకు ప్రాణాపాయం తప్పినట్లు డాక్టర్ యశ్వంత్రాణి పేర్కొన్నారు. ఇ దిలా ఉండగా, దేవమ్మను దవాఖానకు పంపిన తరువాత.. ఈ భూమిపై తమకే హక్కు ఉందం టూ గోపాల్, చంద్రు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అటవీ ప్రాంతంలో తాము మాత్రమే సాగు చేస్తలేమని, ఎంతో మంది అక్రమ సాగు చే స్తున్నారని, మా ఇద్దరిని మాత్రమే అడ్డుకోవడమేంటని వారు ఆరోపించారు.