జడ్చర్లటౌన్, జూలై 6 : ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ పాఠశాలలకు చేరాయి. ఒకటోతరగతి నుంచి పదోతరగతి వరకు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూమీడియం వారీగా పుస్తకాలు, టైటిల్స్ సరఫరా అయ్యాయి. విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునేలా ప్రతి పుస్తకంలో బార్‌కోడ్‌ను పొందుపర్చింది. దీంతో విద్యార్థులు సెల్ఫోన్ల ద్వారా బార్‌కోడ్‌ను అనుసరించి పాఠాలను వీడియో, ఆడి యో రూపంలో విని సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఏర్పడింది. జడ్చర్ల మండలంలో మొత్తం 69 ప్రాథమిక, ఏడు ప్రాథమికోన్నత, 13 ఉన్నత పాఠశాలలు ఉన్నా యి. ఆయా పాఠశాలలకు మొదటి విడుతగా 18,530 పాఠ్యపుస్తకాలు వచ్చినట్లు ఎంఈవో మంజులాదేవి తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం నుంచి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీని ప్రా రంభించారు. మున్సిపాలిటీలోని హరిజనవాడ ఉన్నత పాఠశాలలో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, మండలంలోని తంగెళ్లపల్లి, గైరాన్‌తండా ప్రభుత్వ పాఠశాలల్లో ఎంఈవో మంజులాదేవి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.
సద్వినియోగం చేసుకోవాలి
భూత్పూర్, జూలై 6 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి అన్నారు.మండలంలోని మద్దిగట్ల ప్రాథమికోన్నత పాఠశౠల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కదిరె ప్రియాంకారెడ్డి, సిం గిల్‌విండో డైరెక్టర్ రాంరెడ్డి, హెచ్ఎంలు కవిత, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మండలంలో..
మహబూబ్‌నగర్ రూరల్, జూలై 6 : మండలంలోని కోడూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ శ్రీకాంత్‌గౌడ్ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం రవిపాల్, ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.