ఊట్కూర్, జూలై 6 : అధికారులు ప్రతి పనిలో జవాబుదారీగా వ్యవహరించాలని ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి అన్నా రు. మండల సర్వసభ్య సమావేశానికి బుధవారం ఎంపీపీ అధ్యక్షతన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, స ర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగితేనే గ్రామాలు అభివృద్ధి పథంలోకి వస్తాయన్నారు. గ్రామాల్లో పల్లె ప్రగతి ప్రణాళికతో గు ర్తించిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని ఆదేశించారు. జాతీయ ఆహార భద్రతా పథకం కింద మండల రైతులకు 20 క్వింటాళ్ల కంది విత్తనాలను ఉచితం గా పంపిణీ చేసినట్లు ఏవో గణేశ్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎంపీటీ సీలు హనుమంతు, రాఘవరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండానే విత్తనాలను పంపిణీ చేశారని.. దీంతో చాలా మంది రైతులకు విత్తనాలు అందలేదని వాపోయారు. జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్ కలుగజేసుకొని ఇలాంటి సంఘటన లు పునరావృతం కాకుండా చూసుకోవాల ని ఏవోను ఆదేశించారు. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాల ల్లో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఆం గ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టినట్లు ఎంఈవో వెంకటయ్య తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందు లు లేకుండా తెలుగు, ఆంగ్ల భాషల్లో ముద్రించిన పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేస్త్తుందన్నారు. ఎలక్ట్రిసిటీ ఏఈ బాలరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేశ్, వీఏఎస్ మహదేవ్, పీహెచ్సీ వైద్యుడు నరేశ్‌చంద్ర సంబంధిత శాఖల అ భివృద్ధి కార్యక్రమాల వివరాలను సమావేశంలో చదివి స భ్యులకు వినిపించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, తాసిల్దార్ తిరుపతయ్య, ఎంపీడీవో కాళప్ప, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌రెడ్డి, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు రవిప్రసాద్‌రెడ్డి ఉన్నారు.