జడ్చర్లటౌన్, జూలై 6 : స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రాం ఆశయసాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బాబూ జగ్జీవన్‌రాం వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేయడంతోపాటు దళిత బహుజనుల సంక్షేమానికి అవిశ్రాంతగా కృషి చేశారన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జగ్జీవన్రాంను స్ఫూర్తిగా తీసుకొని ప్రతిఒక్కరూ ప్రజాసేవకు పాటుపడాలని కోరారు. అలాగే వివిధ పార్టీలు, కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్‌రాం విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాద య్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
జగ్జీవన్‌రాం సేవలు చిరస్మరణీయం
మహబూబ్‌నగర్, జూలై 6 : దివంగత మాజీ ఉపప్రధాని, సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్‌రాం అందించిన సేవ లు చిరస్మరణీయమని ఎమ్మార్పీఎస్‌టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్‌మాదిగ అన్నారు. బాబూ జగ్జీవన్‌రాం వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు జయన్న, సాయికుమార్, యాదగిరి పాల్గొన్నారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో..
భూత్పూర్, జూలై 6 : బాబూ జగ్జీవన్‌రాం వర్ధంతిని మున్సిపాలిటీలోని చౌరస్తాలో వివిధ సంఘాలు, పార్టీల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, మురళీధర్‌గౌడ్, బోరింగ్ నర్సింహులు, గడ్డం రాము లు, వెంకటయ్య, యాదయ్య, ఎల్లప్ప పాల్గొన్నారు.