మహబూబ్‌నగర్, జూలై 6 : జిల్లాకేంద్రంలోని బ్రాహ్మణవాడి వాసవీకల్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో యశోద దవాఖాన మలక్‌పేట ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను పట్టణానికి చెం దిన వృద్ధ దంపతులు వీరన్న, రాములమ్మ మనువడు రుత్విక్ ప్రాణాలు కాపాడిన దేవుడవయ్యా అంటూ కంటతడి పెట్టుకొని మం త్రిని నిండు నూరేళ్లు సు:ఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు. చేసిన సహాయం ఒక క్షణంలో మార్చిపోయే రోజులు ఇవి అంటున్న ఈ కాలంలో పొందిన సహాయంను స్మరించుకొని మంత్రిని కలిసి ఆశీర్వదించడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు.
తమ మనువడు రుత్విక్ గడిచిన నాలుగేండ్ల కిందట ఆరోగ్యం బాగలేదని మంత్రికి కలిసి వి వరించారు. మంత్రి వెంటనే స్పందించి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నారు. వైద్య ఖర్చులు చె ల్లించలేని స్థితిలో ఉన్న వారికి మంత్రి పూర్తి భరోసా కల్పిం చి వైద్య చికిత్సలు చేయించడంతో ఆ ప్రాంతానికి వెళ్లిన మంత్రిని కలిసి ప్రత్యేక కృతజతలు తెలియజేయశారు. ఈ సందర్భంగా మంత్రి ఎల్లప్పుడు అందరికీ అండగా ఉంటానని తెలియజేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో హన్వాడ మం డలం వెంకటమ్మకుంట తండాకు చెందిన లక్ష్మణ్, జరుపల తండాకు చెందిన చంద్రశేఖర్ వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహా య నిధి నుంచి మంజూరైన ఒక్కొక్కరికీ రూ.2లక్షల చొప్పున ఎల్వోసీని అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, సర్పంచ్ రాము లు, ఎంపీటీసీ అరుణ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారిణికి మంత్రి అభినందన
మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 6 : చెన్నైలో జరిగిన 7వ సీనియర్ నేషనల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిఫ్‌లో జిల్లా కేంద్రానికి చెందిన జ్యోతి ప్రతిభకనబర్చి వెండిపతకం సా ధించింది. బుధవారం జిల్లా కేంద్రంలో క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. జిల్లా క్రీడాకారిణి జాతీయ స్థాయి టోర్నీలో రాణించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీవైఎస్వో శ్రీనివాస్, కోచ్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.