మహబూబ్‌నగర్ రూరల్, జూలై 5 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం విస్తారంగా వర్షం కురవడంతో పలు చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 8గంటల వరకు వాన పడింది. మ హబూబ్‌నగర్ పట్టణంతో పాటు మండలంలోని అనేక గ్రామాల్లో వర్షం పడింది. దివిటిపల్లి గ్రామంలో ఇల్లు కూలింది. మహబూబ్‌నగర్ మండలం మాచన్‌పల్లి గ్రామంలో 27.8మి.మీ.,అర్బన్‌లో 22 మి.మీ., హన్వడలో 15.5మి.మీ, కోయిల్‌కొండలో 17.8 మి.మీ వర్షం కురిసింది. జడ్చర్లలో అత్యధికంగా 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భూత్పుర్ మండలం కొత్తమొల్గరలో65.5మి.మీ. వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూర్లో 67.8మి.మీ. వర్షపాతం నమోదు కాగా , కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడ్డాయి. నారాయణపేట జిల్లా కోటకొండలో 60మి.మీ., వర్షపాతం నమోదైంది. విత్తనాలు విత్తి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరటనిచ్చింది.