నాగర్‌కర్నూల్, జూలై 5 : రైతుల ఉజ్వల భవిష్య త్ కోసం ఆయిల్‌పాం సా గును ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రె డ్డి తెలిపారు. మంగళవా రం మండలంలోని పెద్దముద్దునూర్ గ్రామంలోని రైతు శ్రీశైలంయాదవ్ పొ లంలో ఆయిల్‌పాం మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయిల్‌పాం సా గుతో రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందన్న ఉద్దేశంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలతో వరిసాగు చేయలేకపోతున్నామని, ఈ పరిస్థితుల్లో రైతులకు అందివచ్చిన అవకాశం ఆయిల్‌పాం సాగు అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మొ క్కలు, ఎరువులు, డ్రిప్లపై రాయితీలను అందిస్తుందన్నారు. ఆయిల్‌పాం మొక్కల కొరత ఏర్పడడంతో మలేషియా, సింగపూర్, థాయిలాండ్ వంటి దేశాలకు అధికారులను పంపి మన నాగర్‌కర్నూల్ జిల్లాకు సరిపడా ఆయిల్‌పాం స్పౌట్స్ తెప్పించామన్నారు. బిజినేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఆయిల్‌పాం నర్సరీ ఏర్పా టు చేశామన్నారు. ఏఈవోలు క్షేత్రస్థాయిలో ప ర్యటించి ఆయిల్‌పాం విస్తీర్ణం పెరిగేలా రైతుల ను చైతన్యం చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంత్‌రావు, జెడ్పీటీసీ శ్రీశైలం యాదవ్, టీఆర్ఎస్ నాయకు లు బంగారయ్య, ఈశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, మాధవరెడ్డి, కురుమూర్తి, అధికారులు పాల్గొన్నారు.