మక్తల్ టౌన్, జూలై 5 : మక్తల్ పట్టణంలోని ద్వారకా ఫంక్షన్ హాల్లో 1979 సంవత్సరంలో నాటి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 46 ఏండ్ల తర్వాత మంగళవారం కలుసుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి ముచ్చట్లు చెప్పుకోవడం ఓ మధురానుభూతి అని పూర్వ విద్యార్థులు అన్నారు.
చిల్లకంటి శారద, విజయమ్మ, ప్రసన్నకుమారి, అరుణ టీచర్, సుజాత టీచర్, అనంతమ్మ, జానమ్మ, సువర్ణ, నారాయణమ్మ, గుడి అరుణ, ఆంద్యాల వరల క్ష్మి, అక్కల వరలక్ష్మి, వెంకటేశ్వరీ, వసంత అందరూ కలిసి గురువులను స్మరిస్తూ సన్మానించారు. ఉపాధ్యాయులు అక్తరున్నీసా, రామన్న, ఆశన్న, అనంతయ్య, దండు వెంకట్రెడ్డి, హన్మంత్ రెడ్డి, సరోజ, మైమూనా, నరసమ్మను సన్మానించారు.