వెల్దండ, జూలై 5 : రాష్ట్రంలో 60 లక్షల సైన్యం కలిగిన అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించిందని ఎమ్మె ల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం వె ల్దండ మండలం పలుగుతండాకు చెందిన 100మందికి పైగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్సీ సమక్షంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏ ర్పాటుచేసి గిరిజనులకు గుర్తింపునిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతులను అక్కున చేర్చుకుంటున్న టీఆర్ఎస్పై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతూ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో మాజీ ఉప సర్పంచ్ చంద్యానాయక్, కిమ్యా నాయక్, పంతు, రమే శ్, రాములు, నంద్యా, గణేశ్, తిరుపతి, నిలియా, రా జు, నవీన్, అనిల్, నాగు నాయక్, మహిళలు ఉన్నారు.
కొల్లాపూర్, జూలై 5 : టీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 20 మంది యువకులు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కుటుంబానికి టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమం లో దళితబంధు తాలూకా కో ఆర్డినేటర్ కాటం జంబులయ్య, సింగిల్‌విండో చైర్మన్లు విజయరామారావు, పెబ్బేటి కృష్ణయ్య, టీఆర్ఎస్ నాయకులు రాజేశ్, తల్లా రి హన్మంత్, బండిశ్రీనివాసులు, ఎల్ఐసీ శ్రీనివాసు లు, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్‌శెట్టి పాల్గొన్నారు.