జడ్చర్ల, జూన్ 19: సీఎం సహాయనిధి పేదలకు వరం అని ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 42మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.39లక్షల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. అందుకోసం ప్రభుత్వ దవాఖానలను ఆధునికీకరించి మెరుగైన వైద్యసహాయం అందించడం జరుగుతుందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయనిధి వరమన్నారు. గతంలోలేని విధంగా సీఎంఆర్ఎఫ్ సహాయనిధులను అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, సర్పంచుల సంఘం రా్రష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మురళి, వైస్‌చైర్మన్ సారిక, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్‌రెడ్డి, చైతన్యనాయక్, జ్యోతికృష్ణారెడ్డి, మార్కెట్ డైరెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాసులు, ముడా డైరెక్టర్లు ఇంతియాజ్‌ఖాన్, శ్రీకాంత్, నాగిరెడ్డి, బృందం గోపాల్, వీరేశ్, దోనూరు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాళా పనులు త్వరగా పూర్తిచేయాలి
జడ్చర్లలోని పాతబజార్ నుంచి కిందకు వచ్చే మురుగునీరుకు సంబంధించిన నాళా పనులను త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మున్సిపల్ అధికారులకు సూచించారు. శనివారం రాత్రి కురిసిన భారీవర్షానికి లోతట్టు ప్రాంతాల్లో వర్షంనీరు చేరడంతో చైతన్యనగర్, గౌడఫంక్షన్హాల్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పైనుంచి వచ్చే వర్షపునీరు, మురుగునీరు పారే కాల్వలను పరిశీలించారు. నల్లకుంట వద్ద ఉన్న నాళాను పరిశీలించి మాట్లాడారు. వానకాలంలో పట్టణంలో వర్షపునీరు నిల్వ ఉండకుండా నాళాల్లో ఉన్న మట్టిని తొలగించి అవసరమున్న చోట డ్రైనేజీలను నిర్మించాలని, నాళాల విస్తరణను చేపట్టాలని అధికారులకు సూచించారు. రైల్వేబ్రిడ్జి సమీపంలో ఉన్న నాలా పనులను చేపట్టాలని సూచించారు. ఇదివరకే అధికారులకు నాళాలను నిర్మించాలని తెలిపినా పనులు ప్రారంభించకపోవడంతో ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వానకాలం వచ్చినా పనులు పూర్తికాకపోడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్‌చైర్‌పర్సన్ సారిక, మాజీ మార్కెట్ చైర్మన్ మురళి, కమిషనర్ మహమూద్‌షేక్, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, నందకిషోర్, లత, నాయకులు దానిష్, రాజుగౌడ్ తదితరులు ఉన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, జూన్ 19: పేద, మధ్యతరగతి ప్రజలకు సీఎం రిలీఫ్‌ఫండ్ వరం లాంటిదని ఎమ్యెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వాడ్యాల్ గేట్ సమీపంలో కొత్తూర్‌కు చెందిన నర్సింహారెడ్డికి రూ.లక్షా 50వేల చెక్కును అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శశిరేఖ, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జంగిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, నాయకులు సుధాబాల్రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, బాలు, శ్రీనివాసులు, నర్సింహ, వెంకట్‌రెడ్డి, భీమ్రాజు, బంగారు, వెంకటయ్య, జగన్‌గౌడ్, గోపాల్ తదితరులు ఉన్నారు.