జడ్చర్ల, జూన్ 17 : ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామా లు అభివృద్ధి చెందుతున్నాయని జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య అన్నారు. శుక్రవా రం జడ్చర్ల మండంలలోని కుర్వపల్లిలో పర్యటించి గ్రామస్తుల సమస్యలను తెలుకున్నారు. ఈ సందర్భంగా పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లోని మురుగునీటి కాలువలు శుద్ధి అయ్యావ ని, చెత్తాచెదారం తొలగించడంతో గ్రా మాలు అందంగా కనిపిస్తున్నాయన్నా రు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం, పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాల్లో పచ్చదనం పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీ వో జగదీశ్, ఉపసర్పంచ్ పాండు, మా ర్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్, శేఖర్, సతీశ్, పంచాయతీకార్యదర్శి నిసారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల మున్సిపాలిటీలో..
జడ్చర్ల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో పట్టణప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. బూరెడ్డిపల్లిలో చేపడుతున్న పట్టణప్రగతి పనులను మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణప్రగతిలో భాగంగా అన్ని కాలనీల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణంలో పారిశుధ్యం లోపించకుండా ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమం లో పీఏసీసీఎస్ చైర్మన్ మల్లేశ్, కౌన్సిలర్ ఉమాదేవి, మాజీ సర్పంచ్ వెంకటేశ్, కోట్ల నర్సిరెడ్డి, ఆంజనేయులు, రాజు, రాము, కరుణాకర్ పాల్గొన్నారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో..
భూత్పూర్, జూన్ 17 : మున్సిపాలిటీలోని పదోవార్డు ఉర్దూమీడియం పాఠశాలలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉర్దూమీడియం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ను పెంచేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం వార్డులో పారిశుధ్య పనులను పరిశీలించారు. కార్యక్రమంలో కమిషనర్ నూరుల్‌నజీబ్, మేనేజర్ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని తాటిపర్తిలో పల్లెప్రగతి పనులతోపాటు నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామా న్ని మండల ప్రత్యేకాధికారి సాయిబాబా పరిశీలించారు. పారిశుధ్యం లోపించకుండా ప్రతిఒక్కరూ పరిసరాలను శు భ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మున్ని, సర్పంచ్ వెంకటయ్య, ఎంపీవో విజయ కుమార్ పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జూన్ 17 : మండలంలోని హేమాజీపూర్, నేలబండతండా, బిల్డింగ్‌తండా తదితర గ్రామాల్లో ఎంపీ వో శ్రీదేవి పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరా రు. అలాగే పెద్దాయపల్లిలో మొక్కలను ఎంపీడీవో కృష్ణారావు పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, కార్యదర్శి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), జూన్ 17 : అడ్డాకుల మండలకేంద్రంతోపాటు పెద్దమునగల్‌చేడ్, కందూరు, శాఖాపూర్, పొన్నకల్, కాటవరం, రాచాల తదితర గ్రామాల్లో పల్లెప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అడ్డాకులలో మురుగుకాల్వలను శుభ్రం చేయించ డం, పిచ్చిమొక్కలు, కంపచెట్ల తొలగిం పు పనులను ఎంపీడీవో మంజుల పర్యవేక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ మంజులాభీమన్నయాదవ్ పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, జూన్ 17 : గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా పెద్దఎత్తున మొక్కలను పెంచాలని తాసిల్దార్ శ్రీనివాసులు అన్నారు. మండలంలోని బోయిన్పల్లి లో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. గ్రామంలో మొక్కలు నాటేందుకు గుంతలను తీయడం, పారిశుధ్య పను లు, చెత్తాచెదారం తొలగింపు పనులను పర్యవేక్షించారు. అదేవిధంగా మిడ్జిల్, వాడ్యాల్, కొత్తపల్లి, వేముల, చిల్వేర్, రాణిపేట తదితర గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ప్రత్యేకాధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాయిలక్ష్మి, ఎంపీవో అనురాధ, డిప్యూటీ తాసిల్దార్ గీత, ఆర్ఐ రామాంజనేయులు, ఏవో సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.