ఎంజీకేఎల్ఐ ప్రధాన కాలువ లైనింగ్ పనులు జెట్ స్పీడ్తో కొనసాగుతున్నాయి. ప్రజ్యోతి కన్స్ట్రక్షన్ కంపెనీ రూ.24 కోట్లకు టెండర్లు దక్కించుకొని పనులు చకచకా చేపడుతున్నది. ఎల్లూరు రిజర్వాయర్ నుంచి సింగవట్నం రిజర్వాయర్ వరకు 10 కిలోమీటర్లకుగానూ ఇప్పటివరకు కేవలం నాలుగు కిలోమీటర్ల మేర మాత్రమే లైనింగ్ పనులు పూర్తయ్యాయి. మిగతా 6 కిలోమీటర్లు లైనింగ్ పనులను చేపట్టాల్సి ఉన్నది. అయితే ఏప్రిల్ నుంచి పనులను ముమ్మరం చేశారు. కేవలం రెండు నెలల్లోనే 1.5 కి.మీ. పనులు పూర్తయ్యాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొల్లాపూర్, జూన్ 7 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తు న్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ లైనింగ్ పనులు జెట్ స్పీడ్తో కొ నసాగుతున్నాయి. హైదరాబాద్కు చెందిన ప్రజ్యోతి కన్స్ట్రక్షన్ కంపెనీ రూ.24కోట్లకు టెం డర్ దక్కించుకొని పనులను చేపడుతున్నది. మొ దట 2018 ఏప్రిల్లో కొల్లాపూర్ మండలంలోని అంకిరావుపల్లి గ్రామ శివారులో కిలోమీటర్ నిడివిలో లైనింగ్ పనులను సదరు కంపెనీ చేపట్టింది. ఎల్లూరు రిజర్వాయర్ ప్రధాన కాలువపై ఉన్న హెడ్ రెగ్యులేటర్ నుంచి సింగవట్నం రిజర్వాయ ర్ వరకు లైనింగ్ పనులను చేపట్టాల్సి ఉంది. అయితే ఏడాదికి ఒక కిలోమీటర్ చొప్పున మా త్రమే లైనింగ్ పనులు పూర్తవుతున్నాయి. ఈ కెనాల్ నుంచే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4లక్షల ఎకరాల్లో రెండు పంటలకు సాగునీరు అం దించాల్సి ఉంది. అయితే యాసంగి పంట కోత లు మార్చి నెలాఖరువరకు కొనసాగుతాయి. దీంతో ప్రతి ఏటా వేసవిలో ఏప్రిల్, మే నెలల్లోనే లైనింగ్ పనులను చేపడుతున్నారు. జూన్ నుంచి వర్షాలు మొదలుకావడంతో 10 నెలలపాటు పనులు నిలిచిపోతున్నాయి.
నాలుగు కిలోమీటర్ల మేర పనులు పూర్తి
ఎల్లూరు రిజర్వాయర్ నుంచి సింగవట్నం రి జర్వాయర్వరకు 10 కిలోమీటర్లకుగానూ ఇప్పటివరకు కేవలం నాలుగు కిలోమీటర్ల మేర మా త్రమే లైనింగ్ పనులు పూర్తయ్యాయి. మిగతా 6 కిలోమీటర్లు లైనింగ్ పనులను చేపట్టాల్సి ఉంది. కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామశివారులో నార్లాపూర్కు వెళ్లే రహదారికి ఇరువైపులా కెనాల్ లైనింగ్ పనులను ఏప్రిల్ మొదటివారం నుంచి ముమ్మరం చేశారు. రెండునెలల్లో 1.5 కిలోమీటర్ లైనింగ్ పనులు పూర్తయ్యాయి. ఎల్లూరు రిజర్వాయర్ నుంచి వచ్చే నీటిని నిలిపేందుకు కెనాల్ మధ్యలో మట్టితో అడ్డుకట్ట వేశారు. కెనాల్లో పేరుకుపోయిన మట్టి, బురదను జేసీబీ, ట్రాక్టర్ల ద్వారా బయటికి తరలిస్తున్నారు. మెయిన్ కెనాల్ బెడ్ 19 మీటర్లు, స్లోపు 9.73 మీటర్లు, లాంగ్ 0.5 మీటర్ల కొలతల ప్రకారంగా లైనింగ్ పనులను చేపడుతున్నారు. పనులను ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన కూలీలు పనులు చేస్తుండగా, సైట్ ఇన్చార్జి బలరామకృష్ణయాదవ్, కంపెనీ ఇంజినీర్లు రాజశేఖర్, రాఘవ పర్యవేక్షిస్తున్నారు.
40 టీఎంసీల నీళ్లు కేటాయింపు..
ఉమ్మడి రాష్ట్రంలో ఎంజీకేఎల్ఐ పథకానికి 25 టీఎంసీల నీటి కేటాయింపు ఉండగా, తెలంగాణ వచ్చాక ప్రభుత్వం అదనంగా 15 టీఎంసీలను పెంచింది. దీంతో కృష్ణానదిలో ఎంజీకేఎల్ఐ పథకానికి మొత్తం 40 టీఎంసీల నీటి కేటాయింపులు చేశారు. అ యితే నీటి కేటాయింపు జరిగి నా ఈ ప్రాజెక్టు పరిధిలో కేవలం 4 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా రిజర్వాయర్లు ఉ న్నాయి. మిగతా 36 టీఎంసీల నీటి ని నిల్వ చేసుకునే వనరులు లేకపోవడంతో ఆశించిన ఫలితం దక్కడంలేదు.
నీటి నిల్వ రిజర్వాయర్లు ఇవే..
ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలో 4లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకుగాను నాలుగు రిజర్వాయర్లు ఉన్నాయి. ఇందులో ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.35 టీఎంసీలు కాగా, సింగవట్నం రిజర్వాయర్ 0.55 టీఎంసీలు. జొన్నలబొగుడ రిజర్వాయర్ 2.14 టీఎంసీలు, గుడిపల్లిగట్టు రిజర్వాయర్ 0.96 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించారు. అయితే కృష్ణానదికి వరద వచ్చినప్పుడు నీటిని మోటర్ల ద్వారా తోడి నిల్వ చేసుకుంటున్నారు. రిజర్వాయర్లలో నీరు తగ్గే కొద్దీ తిరిగి నీటిని నింపుకోవడం జరుగుతున్నది. అయితే ఎంజీకేఎల్ఐ పరిధిలోని ఆయకట్టుకు ఎక్కడ నీరు అందకున్నా ఎల్లూరు రేగుమాన్గడ్డ వద్ద ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు నుంచి మోటర్లను ఆన్ చేసి నీటిని తోడుతుండడంతో మెయిన్ కెనాల్ లైనింగ్ పనులకు అంతరాయం కలుగుతున్నది.