ఊట్కూర్, జూన్ 7 : గ్రామాల అభివృద్ధికి ప్రజలే సారథులని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. ప ల్లె ప్రగతిలో భాగంగా మండలకేంద్రంతోపాటు బిజ్వా రం, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో మంగళవారం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలి సి ఆమె శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు, పాలకులు సమన్వయం తో ముందుకు సాగాలని సూచించారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 15 రోజుల కార్యాచరణ చేపట్టిందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే అంటువ్యాధు లు ప్రబలకుండా ఉంటాయన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలను తీసుకోవాల ని కోరారు. బిజ్వారంలో సంత బజార్‌ను పరిశీలించి ఆరుబయట ప్రాంగణంలో మొక్కలు నాటారు.
మా రుమూల గ్రామంలో ఈజీఎస్, పంచాయతీ నిధుల తో సంత బజార్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. తమ గ్రామంలో కూడా సర్పంచ్‌తో మాట్లాడి ఇలాంటి సం త బజార్‌ను నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. మం డలకేంద్రంలో సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యం లో ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, గ్రా మ పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీలు రోడ్లపై చెత్త ను ఊడ్చి శుభ్రం చేశారు. ఇది గ్రహించిన జెడ్పీ చైర్పర్సన్, అదనపు కలెక్టర్ వారి వాహనాలు దిగి సిబ్బం ది వివరాలను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగురాలైన ఐకేపీ సీసీ నర్సింగమ్మ సైతం శ్రమదానంలో పా ల్గొని పనులు చేయిస్తుండడం చూసి ఆనందం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు అద్భుతంగా సాగుతున్నాయని సర్పంచ్‌తోపాటు సిబ్బందిని అభినందించారు. ఆయా గ్రామాల్లో వన నర్సరీలను పరిశీలించారు. న ర్సరీల్లో మొక్కల వివరాలు తెలిపేందుకు బోర్డులు ఏ ర్పాటు చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. కా ర్యక్రమంలో జెడ్పీ సీఈవో సిద్ధిరామప్ప, ఎంపీడీవో కాళప్ప, ఎంపీవో వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ్ సావిత్ర మ్మ, ఎంపీటీసీలు హనుమంతు, హన్మమ్మ, కార్యదర్శులు సుమలత, మంజుల, ఉపాధి ఏపీవో ఎల్లయ్య, ఈసీ శ్రీనివాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామాల రూపురేఖలు మారాలి
మద్దూర్, జూన్ 7 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చే పట్టిన పల్లె ప్రగతిలో గ్రామాల రూపురేఖలు మారాలని కలెక్టర్ హరిచందన అన్నారు. మండలంలోని ని డ్జింత, కొత్తపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా చేపడుతున్న పనులను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఊ రూవాడా పచ్చదనాన్ని సంతరించుకోవాలని సూచించారు. గ్రామాల్లో పాఠాశాలలకు ప్రహరీ ఏర్పాటు చే సుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, స ర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.
కొనసాగుతున్న పల్లె ప్రగతి
నారాయణపేట రూరల్, జూన్ 7 : మండలంలోని ఊటకుంటతండా, జాజాపూర్, సింగారం తదితర గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో పిచ్చి మొక్కలు తొలగించడంతోపా టు మురుగు కాలువలు శుభ్రం చేయడం తదితర కార్యక్రమాలు చేపట్టారు. జాజాపూర్‌లో ఎస్సీ కాలనీలో ఎంపీటీసీ శేఖర్, కార్యదర్శి శ్రీనివాసులు తడి, పొడి చెత్త వేరు చేయడంపై మహిళలకు అవగాహన క ల్పించారు. అలాగే గ్రామంలో చేపడుతున్న పనులను పరిశీలించారు.
దామరగిద్ద మండలంలో…
దామరగిద్ద, జూన్ 7 : మండలంలోని క్యాతన్ప ల్లి, దామరగిద్ద, గడిమున్కన్పల్లి గ్రామాల్లో పల్లె ప్ర గతిలో భాగంగా మంగళవారం చేపట్టిన పనులను డీ ఎల్‌పీవో సుధాకర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భం గా డీఎల్పీవో మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా మార్చాలని పేర్కొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉం చుకోవడానికి యువత ముందుకు రావాలన్నారు. క్యాతన్‌పల్లిలో రోడ్లు శుభ్రం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుభాశ్, ఎంపీవో రామన్న పాల్గొన్నారు.
పరిసరాల శుభ్రతతో ఆరోగ్యం
బాలానగర్, జూన్ 7: పరిసరాల శుభ్రతతోనే ఆ రోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని అదనపు కలెక్టర్ తేజస్ నందులాల్పవార్ అన్నారు. పల్లెప్రగతి కా ర్యక్రమంలో భాగంగా మంగళవారం మండలకేంద్రం లో నీటి సమస్య, డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమస్యలను అడిగి తె లుసున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజ ల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతోనే ప్రభు త్వం పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టిందన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్యాంసుందర్, ఎంపీడీవో కృష్ణారావు, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీ వో శ్రీదేవి, డీటీ హనీఫ్ఖాన్, వెంకట్రామలు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో జోరుగా పనులు
జడ్చర్లటౌన్, జూన్ 7: పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో పల్లె ప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. మండలంలోని చర్లపల్లిలో మంగళవారం జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య ఉపాధి హామీ కూలీలతో కలిసి మొక్కలకు నాటేందుకు గుంతలు తీశారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని అంతర్గత రోడ్ల వెంట మొక్కలు నాటి సంరక్షించాలని సూ చించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొంగళి జంగయ్య, చర్లపల్లి సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ నర్సింహులు, ఏవో సాయికుమార్, పంచాయతీ కార్యదర్శి నవీన్‌కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జూన్ 7: పల్లెప్రగతి పనులు గ్రామా ల్లో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మండలంలో ఎంపీడీవో కృష్ణారావు, ఎంపీవో శ్రీదేవి, తాసిల్దార్ శ్రీ నివాసులు వేర్వేరుగా పరిశీలించారు. పెద్దాయపల్లి, నందారం, చింతకుంటతండా, బోడగుట్టతండా గ్రా మ పంచాయతీల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. కా ర్యక్రమంలో సర్పంచులు రమేశ్‌నాయక్, శంకర్, ల క్ష్మణ్నాయక్, కార్యదర్శులు అనిల్‌కుమార్, పాండు, తదితరులు పాల్గొన్నారు.