మహబూబ్‌నగర్, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో మతం పేరుతో యువతను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలని బీజేపీ చూ స్తోందని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వి మర్శించారు. కేంద్రంలోని బీజేపీ నాయకులు నో రు తెరిస్తే పాకిస్తాన్ అంటున్నారని, ఆ పార్టీ రాష్ట్ర నాయకుడెమో మసీదులు తవ్వుతామని రెచ్చగొడుతున్నాడన్నారు. తాము కూడా తవ్వడానికి సి ద్ధం కానీ, బీజేపీ నాయకుల్లాగా కాదని.. అభివృ ద్ధి కోసం పునాదులను తవ్వుతామన్నారు. కోస్గి మున్సిపాలిటీలో రూ.40.65కోట్లతో చేపట్టిన ప లు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనకు వచ్చిన ఆయన బస్‌డిపో సమీపంలో ఏ ర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తె లంగాణలో ఎక్కడ కూడా బస్‌డిపో మంజూరు చే యలేదని, కేవలం కోస్గికి మాత్రమే మంజూరు చే శామన్నారు. రోడ్డుపై వ్యాపారం చేసుకునే వారు వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ ఏర్పాటుతో సంతోషంగా ఉన్నారన్నారు. గతంలో కొడంగల్ నియోజకవ ర్గం ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా అభివృద్ధి చెం దుతోందో గుర్తించాలన్నారు. కొడంగల్ ప్రజలు తంతే ఒక నాయకుడు మల్కాజ్‌గిరిలో పడ్డాడని, అక్కడ కూడా ప్రజలు తన్నదానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిది ఐరెన్ లెగ్ అని టీడీపీని నాశనం చేశాడు.. ఇప్పుడు కాంగ్రెస్ ను నాశనం చేయబోతున్నాడన్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మాటల మనుషులు కావాలా చేతల మనుషులు కావాలో కొడంగల్ నియోజక వర్గ ప్రజలు తేల్చుకోవాలన్నారు. కొడంగల్ ని యోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పరిశ్రమలను స్థాపించాలని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి కోరిక మేరకు ఆహారశుద్ధి పరిశ్రమ తీసుకొస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారని, ఇప్పటికే 10ఛాన్స్‌లు ఇచ్చారని, 50ఏండ్లు అవకాశం ఇస్తే రైతులకు ధీమా ఇవ్వలేని దద్దమ్మలు మళ్లీ వచ్చి మరో అవకాశం ఇవ్వమంటే మేము పిచ్చోళ్లమా అన్నారు. అదేవిధంగా సభలో కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ పిట్టకథ చెప్పి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. గ్రామ పంచాయతీలకు, సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రావాల్సిన డబ్బులు ఈ నెల 2వ తేదీనే అందించామని కేటీఆర్ తెలిపారు. రూ. 1400 కోట్లు కేంద్రం మంజూరు చేయాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో 29లక్షల మందికి పింఛన్లు వస్తే ఇప్పుడు 40లక్షల మందికి వస్తున్నాయని.. త్వరలో కొత్త పింఛన్లు ఇస్తామని ఇది తమ బాధ్యత అని తెలిపారు.
రేవంత్‌రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్థానికంగా భూదందాలు చేయడం, అక్రమాస్తులు కూడబెట్టే పనిలోనే బిజీగా ఉండేవాడని, అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా నియోజకవర్గాన్ని నాశనం చేశాడని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. తన స్థాయిని మరిచిపోయి సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తే సహించబోమని రేవంత్‌ను హెచ్చరించారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉండి వెనుకబడిన నియోజకవర్గానికి రూ.350 కోట్ల నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, బండా ప్రకాశ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సత్యనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ, కలెక్టర్ హరిచందన, ఎమ్మెల్యేలు ఎస్ రాజేందర్ రెడ్డి, చి ట్టెం రామ్మోహన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మహేశ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.