గండీడ్, జూన్ 4 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని అంచన్పల్లి, జంగంరెడ్డిపల్లి గ్రా మాల్లో శనివారం నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. గ్రా మాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యానాయక్ పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరిస్తాం
మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 4 : వార్డుల్లో నెలకొన్న స మస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండోవార్డులో అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణప్రగతి కార్యక్రమంతో ప్రతి వార్డునూ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కా ర్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కోరమోని జ్యోతి పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి
మిడ్జిల్, జూన్ 4 : పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని జెడ్పీటీసీ శశిరేఖ అన్నారు. మండలకేంద్రంతోపాటు కొత్తూ ర్, చిల్వేర్, బోయిన్పల్లి, కొత్తపల్లి, వేముల, వల్లభురావుపల్లి, మల్లాపూర్ తదితర గ్రామాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. దోనూర్, భైరంపల్లి గ్రామాల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాయిలక్ష్మి, ఎంపీవో అనురాధ, ఆర్ఐ రామాంజనేయులు, సర్పంచులు రాధికారెడ్డి, నారాయణరెడ్డి, మంగమ్మ, సంయుక్తారాణి, జంగారెడ్డి పాల్గొన్నారు.
పరిసరాల శుభ్రతతో ఆరోగ్యం
హన్వాడ, జూన్ 4 : ఆరోగ్య సంరక్షణకు ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీపీ బాలరాజు సూచించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని వేపూర్‌లో అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రా మాల్లో గుర్తించిన ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు చర్య లు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంఈవో రాజునాయక్, మిషన్ భగీరథ ఏఈ యాదయ్య, ఏపీఎం సుదర్శన్, సర్పంచులు, రేవతి, సత్యమ్మ, వసంత, శ్రీదేవి, సరస్వ తి తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛందంగా పాల్గొనాలి
రాజాపూర్, జూన్ 4 : పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఎంపీపీ సుశీల కోరారు. మండలకేంద్రంతోపాటు, మోత్కులకుంటతండాల్లో అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి పిచ్చిమొక్కలను తొలగించడంతోపాటు మురుగుకాల్వలను శుభ్రం చేయించారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మీదేవి, స ర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహులు, ఎంపీవో వెంకట్రాములు, సర్పంచ్ రవినాయక్, కార్యదర్శులు పాల్గొన్నారు.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
కోయిలకొండ, జూన్ 4 : గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు మండల ప్రత్యేకాధికారి మధుసూదన్‌గౌడ్ అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మండలకేంద్రంలో పర్యటించి మురుగుకాల్వలను పరిశీలించారు. ఇండ్ల మధ్య మురుగు నిల్వకుండా ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం ఎంపీవో నసీర్ అహ్మద్, పంచాయతీ కార్యదర్శి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మండలంలో..
మహబూబ్‌నగర్ రూరల్, జూన్ 4 : మండలంలోని దివిటిపల్లిలో వైస్‌ఎంపీపీ అనిత పర్యటించి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని గ్రామాన్ని సుందరంగా తీ ర్చిదిద్దుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ జరీనాబేగం, పంచాయతీ కార్యదర్శి వీరలింగం పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల, జూన్ 4 : మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామసభలు నిర్వహించి చేపట్టాల్సిన పనులపై తీర్మానాలు చేశారు. ఖానాపూర్‌లో సర్పంచ్ అరుణాసత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామస్తులు రోడ్లను శుభ్రం చేశారు. మాచారం, గొల్లపల్లి గ్రామా ల్లో ముళ్లపొదళ్లు, చెత్తాచెదారం తొలగించారు. గంగాపూర్‌లో పల్లెప్రగతి పనులను జెడ్పీ సీఈవో జ్యోతి, ఎంపీడీవో ఉమాదేవి పరిశీలించారు. కార్యక్రమాలలో సర్పంచులు రాజేశ్వర్‌రెడ్డి, గంగ్యానాయక్, చంద్రకళ, రవినాయక్, రవీందర్‌రెడ్డి, ప్రణీల్‌చందర్, సుందర్‌రెడ్డి, విజయలక్ష్మి, శ్రీనివాసులు, ప్ర భాకర్‌రెడ్డి, నర్సింహులు, సుకన్య, చేతనారెడ్డి పాల్గొన్నారు.
బృహత్తర కార్యక్రమం ‘పట్టణప్రగతి’
జడ్చర్లటౌన్, జూన్ 4 : ప్రభుత్వం చేపట్టిన పట్టణప్రగతి బృహత్తర కార్యక్రమమని రాష్ట్ర కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఎన్.సత్యనారాయణ అన్నా రు. జడ్చర్ల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో పట్టణప్రగ తి కార్యక్రమాన్ని పరిశీలించారు. 12వ వార్డులోని పార్కు ను సందర్శించి మొక్కలు నాటారు. అనంతరం 8వ వార్డులో క్రీడాప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ సారిక, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ మహమూద్‌షేక్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
‘పల్లెప్రగతి’తో గ్రామాలు అభివృద్ధి
బాలానగర్/రాజాపూర్, జూన్ 4 : పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని పం చాయతీరాజ్ జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. మండలంలోని గౌతాపూర్, అప్పాజిపల్లి, గంగాధర్‌పల్లి గ్రామాల్లో పర్యటించి నర్సరీ, పల్లెప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే రాజాపూర్, నర్సింగ్తండాల్లో పల్లెప్రగతి పనులతోపాటు వైకుంఠధామాలు, నర్సరీలను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచులు రమేశ్, శంకర్, శారద, పంచాయతీ కార్యదర్శులు ప్రీతి, ఆంజనేయులు, ఉపసర్పంచ్ కవిత, బాలూనాయక్, శ్రీనివాసులు, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.